హీరోయిన్ స్నేహ.. అచ్చ తెలుగు ఆడపిల్ల లాగా తన చీర కట్టు, అందం, అభినయం తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. స్నేహ ముందుగా బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో మంచి మార్కులు వేయించుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరై వరుస సినిమాల్లో నటించింది. స్నేహ దాదాపు తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ఈమె తన సినిమాల్లో ఏ మాత్రం ఎక్స్పోజింగ్ చేయకుండా, రొమాంటిక్ సన్నివేశాలకు దూరంగా ఉంటూ హోమ్లీ పాత్రలు చేస్తూ సౌందర్యలా మంచి పేరును సంపాదించుకుంది. ఇక అప్పటినుండి స్నేహకు కూడా గ్లామర్ పాత్రలు కాకుండా ఫ్యామిలీ ఉమెన్ పాత్రలే ఎక్కువగా వచ్చాయి. ఇక కొన్ని సంవత్సరాల క్రితం స్నేహ ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక అప్పుడప్పుడు వీరి ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే..

తాజాగా సోషల్ మీడియాలో స్నేహ గురించి ఒక షాకింగ్ విషయం చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. స్నేహ చాలా రోజుల నుండి తన భర్తకు దూరంగా ఉంటుందని, వీరి మధ్య వచ్చిన చిన్న చిన్న మనస్పర్దలే వీరు దూరంగా ఉండడానికి కారణం అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే వీరి మధ్య ఏం జరిగింది అనేది వారికి మాత్రమే తెలుసు.కానీ ఈ విషయం పై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. అయితే కొన్ని ఫ్యామిలీ గొడవల కారణంగా స్నేహ ప్రసన్నల మధ్య మనస్పర్ధలు వచ్చి దూరం పెరిగిందని తెలుస్తోంది.

అందువల్లనే స్నేహ తన భర్త ప్రసన్నకు దూరంగా తన పిల్లలను తీసుకొని వేరే ఇంట్లో ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన స్నేహ అభిమానులు భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది స్టార్ సెలబ్రిటీలు ఎన్నో రోజులు ఫ్యామిలీ లైఫ్ లో హ్యాపీగా ఉన్న జంటలు విడిపోయి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలోనే స్నేహ కూడా విడాకులు తీసుకుంటుందేమోనన్న భయంతో అభిమానులు కంగారు పడుతున్నారు. ఇక ఈ విషయంలో నిజమేంటో అబద్ధం ఏంటో తెలియాలంటే కచ్చితంగా స్నేహ స్పందించాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *