అవును మీరు వింటున్నది నిజమే.. సమంత లాగే ఓ స్టార్ హీరో కూడా అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడట. ప్రస్తుతం సోషల్ మీడియాను ఇదే న్యూస్ కుదిపేస్తుంది..తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయినైనా సమంత మయాసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది. ఇక సమంత తనకు ఉన్న వ్యాధి గురించి బయట పెట్టడంతో సమంత మీద సోషల్ మీడియాలో పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి.

అంతేకాదు సమంత త్వరగా కోలుకోవాలని చాలామంది సెలబ్రిటీలు, అభిమానులు, అక్కినేని అభిమానులు సైతం కామెంట్లు పెట్టారు. ఇక సమంత లాగే కొన్ని అరుదైన వ్యాధులతో బాధపడుతున్న సెలబ్రిటీల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే జాతి రత్నాలు సినిమా దర్శకుడు అనుదీప్ కూడా ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు బహిరంగంగానే చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కూడా తన అరుదైన వ్యాధి గురించి ఓ ఇంటర్వ్యూ లో చెప్పి అందరికి షాక్ ఇచ్చారు.

ఇక ఈయనకు ఈ వ్యాధి ఉన్నట్లు ఈ మధ్యనే వైద్య పరీక్షల్లో తెలిసిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త హాట్ టాపిక్ అయింది. అదేంటంటే.. టాలీవుడ్ లో ఉన్న ఓ హీరోకి కూడా ఓ అరుదైన వ్యాధి సోకినట్లు సమాచారం. అయితే ఆ టాలీవుడ్ హీరో కి ఎప్పటినుండో ఈ వ్యాధి ఉందట. కానీ ఆ వ్యాధి గురించి బయట పెట్టకుండా ఇన్ని రోజులు దాచిపెడుతున్నాడని నెట్టింట్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

ఒకవేళ బయటికి వస్తే తనకు సినీ అవకాశాలు ఎక్కడ రాకుండా పోతాయో అన్న భయంతో ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నట్లు సమాచారం. అయితే ఈ హీరో సమంతతో కూడా కలిసి ఓ సినిమా చేశాడట. ఇక వీరిద్దరూ కలిసి తీసిన ఆ సినిమా అంత హిట్ కానప్పటికీ నటన పరంగా మాత్రం మంచి పేరు తెచ్చుకున్నాడట. ఇక ప్రస్తుతం ఎలాగైనా ఒక్క సినిమానైనా హిట్టు కొట్టాలని ఈ హీరో ఎప్పటినుండో ప్రయత్నిస్తున్నాడట. అంతేకాదు ఈ హీరో సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా ట్రోలింగ్ అవుతూ ఉంటారట. ఏది ఏమైనాప్పటికీ సినీ కెరియర్ కోసం తన భయంకరమైన వ్యాధిని ఇలా దాచడం తప్పు అంటున్నారు ఈ విషయం తెలిసిన నెటిజన్స్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *