దుమ్మురేపే టైటిల్ ఫిక్స్ చేసిన బాలకృష్ణ!!

నందమూరి బాలకృష్ణ హీరో గా ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. వరుస విజయాలతో రికార్డులను కొల్లగొడుతున్న ఈ హీరో ఇప్పుడు చేస్తున్న ఈ NBK 107 సినిమాపై అంచనాలు ఇప్పటికే ఊహించని విధంగా పెరిగిపోయాయి. ఇప్పటిదాకా ఈ సినిమా యొక్క టైటిల్ ను నిర్ణయించలేదని చెప్పాలి. కారణం ఏదైనా ఈ సినిమా కు టైటిల్ ప్రకటించక పోవడం నిజంగా అందరిని నిరాశపరుస్తుంది.

క్రాక్ సినిమా విజయం తర్వాత గోపీచంద్ మలినేని చేస్తున్న ఈ సినిమా లో తప్పకుండా బాలయ్యను ఈ దర్శకుడు అంతకుమించి అనేలా చూపిస్తాడు అనే నమ్మకంతో ఉన్నారు. శృతి హాసన్ కథానాయిక గా నటిస్తుండగా ఈ సినిమా కి థమన్ సంగీతం సమకూరుస్తుండడం విశేషం. అయితే ఈ సినిమాకు టైటిల్ ఏమిటి అనే విషయంలో ఇదివరకే చాలా రకాల రూమర్లు అయితే వచ్చాయి. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా కి బాలకృష్ణ వీర శంకర్ రెడ్డి అనే టైటిల్ ను నిర్ణయించినట్లు తెలుస్తుంది.

ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలిపే అవకాశం ఉన్నట్లు ఇదివరకే ఒక టాక్ కనిపించింది. ఇక డేట్ విషయంలో అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే జనవరి 11వ తేదీన సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *