షూటింగ్స్ నుంచి చిన్న గ్యాప్ దొరకడంతో వెకేషన్ కు బయలుదేరారు హీరో రామ్ చరణ్. ఆయన చార్టెట్ ఫ్లైట్ లో టూర్ కు వెళ్తున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ తో పాటు ఆయన పెట్ పా కూడా ఉంది. ఇటీవలే రామ్ చరణ్ తన బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా గేమ్ ఛేంజర్ నుంచి జరగండి లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాట డిజిటల్ వ్యూస్ లో దూసుకెళ్తోంది.

ప్రస్తుతం ఈ పాటకు 20 మిలియన్ వ్యూస్ దక్కాయి. గేమ్ ఛేంజర్ సినిమాతో పాటు ఆర్ సీ 16 సినిమాలోనూ రామ్ చరణ్ నటిస్తున్నారు. బుచ్చిబాబు డైరెక్షన్ లో ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైందీ ప్రాజెక్ట్. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు మరికొంత టైమ్ పడుతుందట. అలాగే గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ కు గ్యాప్ ఇచ్చారు. ఈ బ్రేక్ లో రామ్ చరణ్ వెకేషన్ కంప్లీట్ చేసుకుని రావాలని బయలుదేరారు. చరణ్ సుకుమార్ తో తన కొత్త ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *