పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన సినిమా సలార్. రెండు భాగాల ఈ సినిమా నుంచి ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ ఈ నెల 22న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మించింది. మరికొద్ది సేపట్లో సలార్ ట్రైలర్ రిలీజ్ కాబోతున్న సందర్భంగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు దర్శకుడు ప్రశాంత్ నీల్.

ప్రశాంత్ నీల్ స్పందిస్తూ – సలార్ నేను 15 ఏళ్ల కిందట రాసుకున్న కథ. అయితే నా తొలి సినిమాగా ఉగ్రమ్ రూపొందించాను. ఆ తర్వాత కేజీఎఫ్ 1, కేజీఎఫ్ 2 చేయాల్సి వచ్చింది. సలార్ ను రామోజీ ఫిలిం సిటీ, తెలంగాణలోని కోల్ మైన్స్, మంగళూరు పోర్ట్, వైజాగ్ పోర్ట్ తో పాటు యూరప్ లో కొంత షూటింగ్ చేశాం. మొత్తం 114 రోజులు షూటింగ్ చేశాం. సలార్ లార్జర్ దేన్ లైఫ్ స్టోరీతో ఎగ్జైటింగ్ థియేట్రికల్ ఎక్సీపిరియన్స్ ఇస్తుంది. అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *