ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో

యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మీద హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న సినిమాకు “భజే వాయు వేగం” అనే టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవాళ “భజే వాయు వేగం” సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో క్రికెట్ బ్యాట్ తో హీరో కార్తికేయ పరుగులు పెడుతుండటం, మరోవైపు పెద్ద మొత్తంలో డబ్బు ఎగరడం కనిపిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ “భజే వాయు వేగం” సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఫ్రెష్ కంటెంట్ తో ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే థియేట్రికల్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయబోతున్నారు.

నటీనటులు – కార్తికేయ గుమ్మకొండ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్, తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు

టెక్నికల్ టీమ్-

మాటలు: మధు శ్రీనివాస్

ఆర్ట్: గాంధీ నడికుడికర్

ఎడిటర్: సత్య జి

సినిమాటోగ్రఫీ: ఆర్.డి రాజశేఖర్

మ్యూజిక్ (పాటలు) – రధన్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – కపిల్ కుమార్

పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్-శ్రీనివాస్)

కో ప్రొడ్యూసర్ – అజయ్ కుమార్ రాజు.పి

ప్రొడ్యూసర్: యూవీ కాన్సెప్ట్స్

దర్శకుడు: ప్రశాంత్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *