ఏడారిలో ప్రయాణించే హీరో అక్కడి వాతావరణంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు, కుటుంబానికి దూరమై, ప్రేయసిని వదిలి వారి జ్ఞాపకాలతో మానసికంగా ఎంత బాధపడ్డాడు అనే నేపథ్యంతో ఓ పాట కంపోజ్ చేయాలి. మామూలుగా మ్యూజిక్ డైరెక్టర్స్ ఆ సందర్భం బాధాకరమైంది కాబట్టి పాథటిక్ ట్యూన్ కంపోజ్ చేస్తారు. కానీ డబుల్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్…స్వయంగా ఆ ఎడారి లొకేషన్ కు వెళ్లాడు. అక్కడి ఎడారిలో తిరుగుతూ, అక్కడి ప్రతికూల వాతావరణం భరిస్తూ, అక్కడి ప్రకృతిని అనుభూతి చెందుతూ “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా కథలో హీరో ఈ పరిస్థితుల్లో ఎలాంటి భావోద్వేగాలకు గురయ్యాడో ఊహిస్తూ పాట కంపోజ్ చేశాడు. ఆ పాటనే తేజమే రెహమానేనా.. ఈ పాటను తాజాగా మూవీ టీమ్ రిలీజ్ చేశారు.

స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమాను బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించింది. ‘తేజమే రెహమానేనా..’ లిరికల్ సాంగ్ కు రాకేందు మౌళి లిరిక్స్ అందించగా జితిన్ రాజ్ పాడారు. ఏఆర్ రెహమాన్ ఎప్పటిలాగే బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed