సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే ప్రమోషన్ యాక్టివిటీస్ చేస్తుండటం ఇటీవల స్టార్ హీరోల సినిమాల విషయంలో బాగా జరుగుతోంది. ఎన్టీఆర్ దేవర సినిమా కూడా ఇలాగే షూటింగ్ లో ఉండగానే పబ్లిసిటీ రంగంలోకి దిగుతోంది. త్వరలో రానున్న క్రిస్మస్ పండుగుక ఈ సినిమా నుంచి ఇంట్రో టీజర్ ను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఈ ఇంట్రో టీజర్ రిలీజ్ తో దేవర హంగామా మొదలవుతుందని అనుకోవచ్చు.

ఎన్టీఆర్ హీరోగా రెండు భాగాలుగా దేవర సినిమాను దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంయుక్తంగా దేవరను నిర్మిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ వచ్చే ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతోంది. పోర్ట్ ఏరియా బ్యాక్ డ్రాప్ కథతో సాగే దేవరలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *