సలార్ సినిమా సెట్ లో హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలిసి ఫోన్ చూస్తున్న ఓ స్టిల్ ఉంది. ఈ స్టిల్ కు మంచి క్యాప్షన్ రాసిన నెటిజన్స్ కు సలార్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ ఇస్తామంటూ మేకర్స్ హోంబలే ఫిలింస్ ప్రకటించింది. రేపు సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సినిమా ట్రైలర్ రిలీజ్ అ‌వుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రభాస్ ఫ్యాన్స్, సినీ ప్రియుల్లో క్రేజ్ తీసుకొస్తోంది.

చాలా మంది నెటిజన్స్ తమ క్యాప్షన్స్ రాసి పోస్ట్ చేస్తున్నారు. బ్రదర్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని, డైనోసార్ జురాసిక్ పార్క్ లో అడుగుపెడుతోందని, ప్రభాస్ ను ఆటం బాంబులా, ఆ బాంబు తయారు చేసిన శాస్త్రవేత్త ఓపెన్ హైమర్ తో ప్రశాంత్ నీల్ ను పోలుస్తూ క్యాప్షన్స్ పోస్ట్ చేస్తున్నారు. ఈ క్యాప్షన్స్ లో బెస్ట్ ఐదు క్యాప్షన్స్ పంపిన వారిని సెలెక్ట్ చేసి వారి దగ్గర్లోని థియేటర్ లో సలార్ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ ఇస్తారు. డిసెంబర్ 22న సలార్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed