స్టార్ హీరో ప్రభాస్ సలార్ మేనియా యూఎస్ లో మళ్లీ మొదలైంది. గతంలో సెప్టెంబర్ రిలీజ్ టైమ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ 7 లక్షల డాలర్స్ గ్రాస్ సాధించి..ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడు మళ్లీ డిసెంబర్ 22న రిలీజ్ కు ముందు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ కలెక్షన్స్ సర్ ప్రైజ్ చేస్తున్నాయి.
యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగానే లక్ష డాలర్స్ గ్రాస్ కలెక్షన్స్ దాటేసింది. దీంతో అక్కడ సలార్ మేనియా మళ్లీ మొదలైనట్లు అర్థమవుతోంది. డిసెంబర్ 21 నుంచే ప్రీమియర్స్ మొదలుకానున్నాయి. దాంతో అప్పటిలోగా టికెట్ బుకింగ్స్ లో సలార్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక మరోవైపు ప్రపంచవ్యాప్తంగా సలార్ డిస్ట్రిబ్యూటర్స్ ను లాక్ చేస్తోంది నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్. వరల్డ్ వైడ్ అత్యధిక థియేటర్స్ లో సలార్ రిలీజ్ కాబోతోంది.