పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ డీటెయిల్స్ కూడా మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. యూఎస్ లో సలార్ బుకింగ్స్ కు కూడా డేట్ ఫిక్స్ చేశారు. వచ్చే సోమవారం నుంచి ఈ సినిమా యూఎస్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ కానున్నాయి. సలార్ మూవీ మీద ఓవర్సీస్ లో చాలా క్రేజ్ ఉంది. ఎన్ఆర్ఐలు ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. దీంతో టికెట్ బుకింగ్స్ లో సలార్ కొత్త రికార్డ్ క్రియేట్ చేసే అవకాశాల కనిపిస్తున్నాయి.

ఈ నెల 20వ తేదీ నుంచి సలార్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రత్యాంగిర సినిమాస్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ప్రభంజనానికి రంగం సిద్ధం అంటూ పోస్ట్ చేసింది. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలు ఓవర్సీస్ లో రికార్డ్ కలెక్షన్స్ రాబట్టాయి. సలార్ కూడా అలాంటి చరిత్రే సృష్టించనుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. హోంబలే ఫిలింస్ బ్యానర్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ ను రెండు భాగాలుగా రూపొందించారు. ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *