పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కొత్త సినిమా సలార్ పై మరింత హైప్ పెంచారు కన్నడ స్టార్ హీరో యష్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తాను చేసిన కేజీఎఫ్ కంటే సలార్ పదింతల హీరోయిజం, ఎలివేషన్స్ తో ఉంటుందని యష్ చెప్పాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో యష్ సలార్ గురించి చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సలార్ మీద మరింత హైప్ పెంచుతున్నాయి.

కేజీఎఫ్ సినిమా చూసిన వాళ్లే సినిమా అంతా రెండున్నర గంటల ట్రైలర్ లా ఉందని, అంత ఎలివేషన్స్ ఉన్నాయని చెబితే..అంతకు పది రెట్లు హీరోయిజం అంటే…సలార్ ఏ రేంజ్ లో తయారైందో అనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ప్రశాంత్ నీల్ ఒక కొత్త సినిమాటిక్ ప్రపంచాన్ని తెరపైకి తీసుకురాబోతున్నాడని, అందులో కేజీఎఫ్ ఒక చిన్న పార్ట్ మాత్రమేనని యష్ చెప్పడం కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. మహేశ్ బాబు, ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేయబోయే సినిమాలు కూడా కేజీఎఫ్, సలార్ కథలతో ముడిపడి ఉంటాయనే క్రేజీ టాక్ వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *