పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మొదటి మూడు రోజులు బాగానే కలెక్షన్స్ రాబట్టింది. ఆతర్వాత మాత్రం కలెక్షన్స్ బాగా పడిపోయాయి. ఇదిలా ఉంటే.. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ సంక్రాంతికి రానుందని వార్తలు వస్తున్నాయి. ఓటీ సినిమాని డిసెంబర్ లో విడుదల చేయాలి అనుకుంటున్నారు. ఇప్పటి వరకు యాభై శాతం షూటింగ్ పూర్తయ్యింది. తాజా షెడ్యూల్ త్వరలో స్టార్ట్ చేయనున్నారు. అయితే.. డిసెంబర్ లో ఓజీ.. జనవరిలో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ చేయడం సాధ్యమేనా అంటే సాధ్యం కాకపోవచ్చు అనే టాక్ వినిపిస్తోంది.

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి దాదాపు 90 రోజుల డేట్స్ ఇవ్వాలి. ఎంత లేదన్నా 70 రోజుల డేట్స్ ఇవ్వాల్సివుంటుంది. ఇప్పుడున్న పొలిటికల్ బిజీలో పవన్ అన్ని డేట్స్ ఇవ్వలేడు. అందుచేత ఉస్తాదు సంక్రాంతికి వస్తుంది అనే వార్తలో వాస్తవం లేదని చెప్పచ్చు. ఉస్తాద్ సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు కానీ.. పవన్ బిజీగా ఉండడం వలన కుదరలేదు. ఆలస్యం అవుతుండడం వలనే హరీష్ శంకర్ రవితేజతో సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది. ఉస్తాద్ భగత్ సింగ్ సమ్మర్ లో రావచ్చు. లేదా ఆతర్వాత రావచ్చు. క్లారిటీ రావాలంటే మాత్రం కొన్నాళ్లు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *