Siddharth-adithi

Siddharth-adithi: సిద్ధార్థ్.. ఈ హీరో పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బాయ్స్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరో కొద్ది రోజుల్లోనే టాలీవుడ్ లో లవర్ బాయ్ గా మారిపోయారు. ఈయన నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, చుక్కల్లో చంద్రుడు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్ వంటి సినిమాల ద్వారా ఈయన తెలుగు ఇండస్ట్రీలో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నారు. అలాంటి ఈ హీరో ఈ మధ్యకాలంలో తెలుగులో కనిపించడం లేదు.

ఇక సిద్ధార్థ్ అదితి (Siddharth-adithi) గత కొన్ని రోజులుగా కలిసి తిరుగుతున్నారు. అంతేకాదు సిద్ధారర్థ్ అతిధి డేటింగ్ చేస్తున్నారని వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో శర్వానంద్ ఎంగేజ్మెంట్ కి కూడా సిద్ధార్థ్ అతిథి ఇద్దరు కలిసి రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీరు కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి.

ఇప్పటికే వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా అంటూ చాలామంది వారి సన్నిహితులు చెప్పుకొచ్చారు. అయితే సిద్ధార్థ్ ఇండస్ట్రీకి రాకముందే మేఘన అనే అమ్మాయితో పెళ్లయింది.కానీ నాలుగు సంవత్సరాలకే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకొంతమంది హీరోయిన్లతో కూడా సిద్ధార్థ్ ప్రేమాయణం నడిపించారు. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో సిద్ధార్థ్ అతిధి (Siddharth-adithi) తో ప్రతిసారి మీడియా కంట పడడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే అదితి కి కూడా ఇప్పటికే పెళ్లై విడాకులు అయ్యాయి. మహాసముద్రం సినిమా చేసే టైంలో సిద్ధార్థ్ అదితి (Siddharth-adithi) ఇద్దరు ప్రేమలో పడ్డట్టు సమాచారం. అయితే వీరిద్దరి గురించి తెలిసిన కొంత మంది సన్నిహితులు వీళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నది నిజమే కానీ పెళ్లి వారికి కలిసి రాదు అని మాతో చెప్పారంటూ వారి సన్నిహితులు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు. మరి వీరు పెళ్లి చేసుకుంటారా లేక సహజీవనం మాత్రమే చేసి పక్కకు తప్పుకుంటారా అనేది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed