ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.. రసవత్తరమైన రాజకీయంలో ఉత్తరాంధ్ర పాత్ర చాలా పెద్దది. 2019 ఎన్నికలలో వైఎస్ఆర్సిపి పార్టీకి ఉత్తరాంధ్ర పెద్దపీట వేసింది. ఇప్పుడు అదే ఉత్తరాంధ్ర వచ్చే ఎన్నికలలో ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా పక్క పక్కన ఉండే రెండు నియోజకవర్గాలు ఇబ్బందికర పరిస్థితులను చూపిస్తుంది. మన్యం జిల్లాలోని కురుపాం నియోజకవర్గం, పార్వతి పురం నియోజకవర్గం గ్రూప్ రాజకీయ లతో,అవినీతి వేట లతో, బావ బామ్మర్ది పంచాయతీలతో కొట్టుకుంటున్నారు. మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి.. పార్వతీపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అలజంగి జోగారావు మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది.. ఈ యుద్ధం ఎక్కడ వరకు చేరుకుందంటే ఆఖరికి పార్టీ కార్యక్రమాలలో ఒకరి పేరు ఒకరు చెప్పలేని స్థితికి చేరుకుంది. ఇటీవల పార్వతీపురం నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జోగారావు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో అతనితోపాటు వైఎస్ఆర్సిపి నాయకుడు మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి భర్త పరిషత్ రాజ్ కూడా పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో పరిషత్ రాజ్ ఎమ్మెల్యే జోగారావు పేరు చెప్పడానికి కూడా ఇష్ట పడలేదు. ఎమ్మెల్యే జోగారావు పై అనేక ఆరోపణలు వస్తున్నప్పటికీ దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఆరోపణలన్నిటిని పట్టించుకోకుండా ఎమ్మెల్యే పోతున్నారు అని బయట టాక్.

ఓవర్గం మీడియాను ఎమ్మెల్యే జోగారావు పెంచి పోషిస్తున్నప్పటికీ చాప కింద నీరులా ఆయనపై అవినీతి ఆరోపణలు పెరిగిపోతూ వస్తున్నాయి. దీనికి తోడు పార్వతిపురం ఎమ్మెల్యే టికెట్ రేసులో ప్రస్తుత టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ప్రసన్నకుమార్ నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమాలపై దృష్టి పెంచారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నానని తన సొంత కార్యకర్తలకు పలుమార్లు చెప్పినట్టు కూడా సమాచారం. ఎమ్మెల్యే జోగారావు కి ఈ విషయం తెలిసి ముందుగానే అప్రమత్తమై ఓవర్గం ప్రజలతో చైర్మన్ ప్రసన్నకుమార్ పై నిఘా పెట్టమని చెప్పినట్టు విశ్వసించిన వర్గాల సమాచారం. ఈ గ్రూపు రాజకీయాలు మధ్య ఎమ్మెల్యే ఎమ్మెల్యే జోగారావు కోట్ల రూపాయలు దందా చేసి భారీగా సొమ్మును వెనకేసుకున్నారు.. ఇది ఆ నియోజకవర్గంలో చిన్నపిల్లాడిని అడిగిన చెప్పే సత్యం అంటూ భారీ టాక్ నడుస్తోంది. దీనికి నిదర్శనమే కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే జోగారావు గడపగడప కార్యక్రమానికి పార్వతిపురం నియోజకవర్గంలోని బలిజిపేట మండలానికి వెళ్లారు. ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యే పై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సందట్లో సడే మియా అంటూ.. ప్రసన్నకుమార్ పరిషత్ రాజుతో కలిసిమెలిసి ఉంటూ జోగారావు పై అస్త్రాలు ప్రయోగించడానికి సిద్ధమైపోయారు. కానీ ఉత్తరాంధ్ర పెద్ద నేత నీడలో ఎమ్మెల్యే జోగారావు ఒంటి కన్నుతో నిద్రిస్తున్నారు. జోగారావు చుట్టూ ఎప్పుడూ ఉండే నలుగురు మనుషులు కీలకంగా పనిచేస్తూ అన్ని విషయాలను ఎప్పటికప్పుడు జోగారావు చెవిలో వేస్తూనే ఉన్నారు. తన నియోజకవర్గంలో ప్రసన్నకుమార్ వచ్చి పర్యటించడం.. ప్రజలతో మమేకం అవడం అంతా గమనిస్తూనే ఉన్నారు.. కానీ ఇక్కడ ప్రసన్నకుమార్ నోటితో మాట్లాడుతుంటే.. అక్కడ జోగారావు కరెన్సీ నోట్ల తో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అందరూ కరెన్సీ వైపే చూస్తారు తప్ప నోటి మాటలతో చెప్పే తీయ్యటి అమృతమైన చేదుగానే అనిపిస్తుంది. 2014 ఎన్నికల్లో ప్రసన్నకుమార్ గెలుపు వరకు వెళ్లి ఓటమి పాలవడానికి కారణం కూడా ఈ కరెన్సీ నోట్లు. ఓటుకి నోటు పంచడంలో ఆయన విప్లమయ్యారు.. ఇప్పుడు కూడా చుట్టూ ఒక నలుగురిని వేసుకొని తిరగడం తప్ప చేసేదేమీ లేదంటూ కూడా సాగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో ప్రసన్న కుమార్ కి అత్యంత సాన్నిహిత్యం ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవల్ లో విఫలమవుతున్నారు. అందుకే ఇప్పుడు చైర్మన్ ప్రసన్నకుమార్ తన రూటు మారుస్తూ ఈ మధ్యకాలంలో మీడియాపై ఫోకస్ పెంచారు.. బాగానే మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు.. అంతేకాదు కొంతమంది బడా నాయకులతో సంప్రదింపులు చేసి సహాయం కావాలి అని కూడా అభ్యర్థిస్తున్నట్టు సమాచారం.. ఈ అభ్యర్థన లిస్టులో పరిషత్ రాజు మొదటి వ్యక్తిగా తెలుస్తుంది. ఈ పార్వతీపురం,కురుపాం నియోజకవర్గాలలో పెద్దల పరిశీలన కరువైంది.. ఇక వచ్చే ఎన్నికలలో సొంత పార్టీ నాయకులే వారి ఓట్లను చీల్చే అవకాశం కనిపిస్తుంది. రాను రోజులలో ఏం జరుగుతుందో చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *