Showkar JanakiShowkar Janaki.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ సీనియర్ నటీమణులలో షావుకారు జానకి (Showkar janaki)కూడా ఒకరు అనే విషయం తెలిసిందే. తెలుగుతోపాటు ఇతర భాషల్లో కూడా 370కి పైగా సినిమాలలో నటించి ఆ సినిమాలతో సక్సెస్ అందుకున్నారు. జానకి 200 కంటే ఎక్కువ సినిమాలలో హీరోయిన్గా చేసిన ఈమె తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా షావుకారు అనే సినిమా ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె సత్యసాయిబాబా భక్తురాలు కావడం గమనార్హం.

సినీ ఇండస్ట్రీలోకి రాకముందు ఎన్నో రంగస్థలం నాటకాలలో నటించి సినిమాలతో కూడా తన సత్తా చాటారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షావుకారు జానకి మాట్లాడుతూ.. దేవదాసు సినిమాలో అవకాశం వచ్చి పది రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత సినిమా నుంచి తొలగించాలని తెలిపారు. అయితే తనకు ఎలాంటి రోల్స్ నప్పుతాయో అవే ఇచ్చేవారు అని కూడా ఆమె తెలిపారు. తన విషయంలో అన్నీ తానేనని షావుకారి జానికి చెప్పుకొచ్చారు.

ఒకానొక సమయంలో తన ఆరోగ్యం బాగాలేక పుట్టింటికి వెళ్తే.. ఆ సమయంలో డిఫరెన్స్ ఫీలయ్యాను అని.. పెళ్లయిన తర్వాత పుట్టింటికి వెళ్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో అర్థమైందని ఆమె తెలిపారు. జీవితంలో ఏ ఆడది చేయకూడని తప్పు పుట్టింటికి వెళ్లి అక్కడ ఉండటమేనని.. ఆ తప్పు తాను చేశానని కూడా షావుకారు జానకి కామెంట్ చేయడం గమనార్హం.అంతేకాదు వెరీ లవింగ్ పేరెంట్స్ ఉంటే మాత్రమే పుట్టింటికి వెళ్ళాలి అని.. ఒకసారి పెళ్లి చేసుకోవాలని అనుకుంటే అత్తారింటికి పరిమితం కావాలని డిసైడ్ అయినప్పుడే పెళ్లి చేసుకోవాలని కూడా ఆమె తెలిపింది.

ఒక్కోసారి మనం ఊహించని పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అని తెలిపింది. అందుకే తాను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతానని ఆమె తెలిపింది. మొత్తానికి అయితే షావుకారు జానకి చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *