Jagapathi Babu: సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు మొదట చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఆ తర్వాత స్టార్ హీరోలుగా ఎదిగిన వాళ్ళు అనేకం ఉన్నారు.ఇక స్టార్ హీరోలు సైతం అవకాశాలు రాక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే టైంలో విలన్ లుగా,క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలోకి మళ్లీ రియంట్రీ ఇస్తారు. ఇక అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ నటుడు కూడా ఒకరు. ఇక ఆ హీరో ఎవరో కాదు జగపతిబాబు.. ఈయన మొదట హీరోగా కుటుంబ కథా సినిమాల్లో నటించి కుటుంబ కథ ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు.

కానీ రాను రాను అవకాశాలు తగ్గడంతో బాలకృష్ణ (Balakrishna) హీరోగా వచ్చిన లెజెండ్ సినిమాతో మొదటిసారి విలన్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక ఈయన విలనిజంతో అందరినీ ఆకట్టుకోవడంతో వరుసగా సినిమాల్లో విలన్ పాత్రలు, అలాగే హీరో హీరోయిన్లకు తండ్రి పాత్రల్లో నటిస్తున్నారు . ఇక జగపతిబాబు (Jagapathi Babu) తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ప్రస్తుతం నాకు మంచి సాఫ్ట్ క్యారెక్టర్ చేయాలని ఉంది.

ఇక టాలీవుడ్ లో నటించే స్టార్ హీరోల సినిమాల్లో హీరోలకే కాకుండా మిగతా నటీనటులకు కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక సినిమాలో కేవలం హీరో మాత్రమే కాకుండా మిగతా పాత్రలకు కూడా ప్రాధాన్యత ఉంటే కచ్చితంగా ఆ సినిమా హిట్ అవుతుంది. నాకు సర్కార్ లాంటి ఓ సినిమాలో నటించాలని కోరిక. నా కూతురికి పెళ్లి చేశాక నా అల్లుడు ఎలా ఉంటారో అని చాలా బాధపడ్డాను.కానీ నా అల్లుడు చాలా మంచివాడు.నా కూతుర్ని చాలా బాగా చూసుకుంటాడు.

నాకు గాడ్ ఫాదర్ రోల్ లో నటించాలని ఒక ఆశ ఉంది. ఇక నాకు జీవితంలో ఏదైనా కావాలి అని అనుకుంటే అది నా అనుకున్న వాళ్ళంతా నా ముందు బ్రతికి ఉండడం అంతే.ఇక నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్త లో ఓ ప్రొడ్యూసర్ ని కొట్టాను. ఎందుకంటే ఆయన స్టార్ హీరోయిన్ విషయంలో తప్పుగా ప్రవర్తించారు.అందుకే ఆ ప్రొడ్యూసర్ ని నేను కొట్టాను. కానీ ఆ ప్రొడ్యూసర్ పేరు ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదు. అంటూ జగపతిబాబు (Jagapathi Babu) తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవ్వడంతో జగపతిబాబు ఏ హీరోయిన్ కోసం ప్రొడ్యూసర్ని కొట్టారో అంటూ నెటిజన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు.

Click here for follow Pakkafilmy in google news

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *