VineethaVineetha: ప్రముఖ దర్శకుడు ఈ వీ వీ సత్యనారాయణ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వినీత, సౌందర్య హీరోయిన్లుగా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. అప్పట్లో ఎంత విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్నపిల్లలను మొదలుకొని పెద్దవాళ్ల వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సినిమా. ఈ సినిమా సక్సెస్ అవ్వడమే కాదు అంతకుమించి దర్శక నిర్మాతలకు లాభాల పంట పండించింది.

ఈ సినిమాలో నేపాలి యువతీ పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించిన కేరళ కుట్టి వినీత (Vineetha) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈమె చాలా అద్భుతంగా.. తన నటనతో యువతను ఆకట్టుకుంది. వచ్చి రాగానే తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న ఈమె ఎందుకో ఎక్కువ కాలం హీరోయిన్గా తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగ లేక పోయింది . దీనికి తోడు తెలుగులో సినిమా అవకాశాలు కూడా రాకపోవడంతో అడ్డదారుల్లో డబ్బు సంపాదించడం కోసం అప్పట్లో వ్యభిచారం కూడా నిర్వహించిందని సమాచారం.

వ్యభిచారం కేసులో పోలీసులకు దొరికి కొంతకాలం పాటు జైలు శిక్ష కూడా అనుభవించింది అనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి. నిజానికి చక్కని ముఖ కవలికలు, అభినయం, అందం ఉన్నటువంటి వినీత ఒక్కసారిగా ఇలాంటి కేసుల్లో ఇరుక్కోవడంతో ఆమెకు అవకాశాలు కూడా తగ్గిపోయాయి.ప్రస్తుతం చెన్నైలో నివాసం ఉంటున్న ఈమె ఇప్పటికీ కూడా పెళ్లి చేసుకోలేదు. తాత్కాలిక ఆనందాల కోసం అడ్డుదారుల్లో డబ్బు సంపాదించాలని పలు అక్రమాలకు పాల్పడి సినీ జీవితాన్ని నాశనం చేసుకుంది అని కొంతమంది చెబుతూ ఉంటారు.

కేవలం సినీ జీవితాన్నే కాదు వ్యక్తిగత జీవితాన్ని కూడా వినీత కోల్పోయిందని చెప్పవచ్చు. తాత్కాలిక ఆనందాలకు పోతే శాశ్వతంగా.. భవిష్యత్తులో జరిగే పరిణామాలను ఆమె ఊహించకపోవడం వల్ల ఇప్పుడు ఒంటరిగా తన జీవితాన్ని కొనసాగిస్తోంది అనడంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *