Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు నమ్రత లు వంశీ సినిమా లో నటించే టైంలో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరు పెళ్లికి అప్పట్లో కృష్ణ గారు ఒప్పుకోలేదని కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఎలాగొలా పెద్దలను ఒప్పించి చాలా సింపుల్ గా మహేష్ బాబు నమ్రతలు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇక ఈమధ్యనే నమ్రత తన 51వ పుట్టినరోజును జరుపుకుంది. అయితే నమ్రత మహేష్ బాబు కంటే వయసులో పెద్దది.

అయినప్పటికీ వీరిద్దరి మధ్య ఎంతో అన్యోన్యత ఉంటుంది.ఈ ఇద్దరికీ పెళ్లయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఎలాంటి గొడవలు లేకుండా చాలా అన్యోన్యంగా ఉంటారు.అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్యూటెస్ట్ కపుల్ గా పేరు కూడా తెచ్చుకున్నారు. అలాంటి మహేష్ బాబు (Mahesh Babu) నమ్రతల గురించి ప్రస్తుతం ఒక విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది. మహేష్ బాబుకి నమ్రత అంటే అంత ఇష్టం ఉండడానికి ప్రధాన కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మహేష్ బాబు నమ్రత (Namratha) ల పెళ్లి అయినప్పటినుండి నమ్రత తన ఇంటి విషయంలో అలాగే మహేష్ బాబు సినిమాల విషయంలో అన్నీ దగ్గరుండి చూసుకుంటుందట. అంతేకాదు నమ్రత అంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ పెళ్లయ్యాక సినిమాలకు పూర్తిగా దూరంగా ఉండి కుటుంబానికి అలాగే మహేష్ బాబుకి సంబంధించిన విషయాలను దగ్గరుండి చూసుకుంటూ మహేష్ బాబు వెనకుండి ముందుకు నడిపిస్తుంది.

అలాగే నమ్రత మహేష్ బాబు (Mahesh Babu) జీవితంలోకి వచ్చాక ఆయన జీవితంలో ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరిగాయి. అలాగే మహేష్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉండడానికి కారణం కూడా నమ్రత నేనట.ఆమె మహేష్ బాబు నటించిన కథల విషయంలో, స్టోరీలు వినడం, ఓకే చేయడం వంటివి చేస్తుండట. ఇలా మహేష్ బాబుని ముందుకు నడిపిస్తూ ఎల్లవేళలా మహేష్ బాబుకి సపోర్ట్ ఇస్తూ ఉంటుందట. ఈ కారణం వల్లే మహేష్ బాబు నమ్రత (Namratha)  అంటే చాలా ఇష్టపడతాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *