టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. యంగ్‌ హీరో సుధీర్ వర్మ(Sudheer Varma) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వైజాగ్‌లోని తన స్వగృహంలో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. సుధీర్ వర్మ బలవన్మరణ విషయాన్ని ఆయన సహ నటుడు సుధాకర్ కోమాకుల సోషల్ మీడియా వేదికగా తెలిజయేశారు. సుధీర్ మ‌ర‌ణం ప‌ట్ల‌ నటుడు సుధాకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్న నిజాన్ని తాను నమ్మలేకపోతున్నానని.. తనతో మంచి స్నేహం ఎప్పటికీ గుర్తుండిపోతుందని సుధాకర్ కోమాకుల(Sudhakar Komakula) తన ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. 2013లో తిరుమ‌ల కిషోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `సెకండ్ హ్యాండ్` సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సుధీర్ వ‌ర్మ‌.. 2016లో వ‌చ్చిన `కుందనపుబొమ్మ` సినిమాలో హీరోగా న‌టించాడు.

వర ముళ్ళపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి(chandini chowdary) హీరోయిన్ గా న‌టిస్తే సుధాకర్ కోమాకుల కీల‌క పాత్ర‌ను పోషించాడు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన సుధీర్ వ‌ర్మ‌.. ఆ త‌ర్వాత షూటౌట్‌ ఎట్‌ ఆలేరు త‌దిత‌ర‌ సినిమాల్లో నటించాడు. అయితే ఎంతో భ‌విష్య‌త్తు ఉన్న సుధీర్ వ‌ర్మ‌.. ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

అవకాశాలు రాక జీవితాన్ని అర్థాంతరంగా ముగించాడా..? లేక వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌ వల్లన అన్నది తేలాల్సి ఉంది. ఆర్థిక ఇబ్బందులే కారణమని ఇన్‌సైడ్ టాక్ న‌డుస్తోంది. ఇక సుధీర్ వర్మ ఆత్మహత్య(Suicide) గురించి తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. సుధీర్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *