ANRANR.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నవశకం అనగానే ముందుగా గుర్తొచ్చే నటుల పేర్లు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ , శోభన్ బాబు, కృష్ణంరాజు అని చెప్పవచ్చు. అయితే గత ఏడాది కృష్ణ మరణించడంతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నవ శకం ముగిసింది. ఇకపోతే ఎప్పటికీ ప్రజలు మరువని గొప్ప నటులలో వీరు ముందు స్థానంలో ఉంటారు. ఇకపోతే మద్రాస్ పరిశ్రమను హైదరాబాదులో స్థిరపడడానికి కృషి చేసిన వారిలో వీరు కూడా ఒకరు. అప్పట్లోనే హైదరాబాదు నగరంలో ఎన్టీఆర్ రామకృష్ణ స్టూడియోస్ ను నిర్మిస్తే.. ఏఎన్ఆర్(ANR) అన్నపూర్ణ స్టూడియోని నిర్మించి తెలుగు సినీ ఖ్యాతికి సరికొత్త పుంతలు తొక్కించారు.

ఇకపోతే ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ లతోపాటు ప్రముఖ నిర్మాత డి రామానాయుడు, దాసరి వంటి వారు కూడా సినీ ఇండస్ట్రీకి ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా ఏఎన్ఆర్ చివరి వరకు రాజకీయాల వైపు వెళ్లకుండా చివరి శ్వాస వరకు సినిమాలలోనే నటిస్తూ చివరిగా తన జీవితాన్ని చాలించారు. నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) చివరిగా తన ఫ్యామిలీ సభ్యులతో సినిమాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన క్యాన్సర్ బారిన పడి మరణించారు. ఇకపోతే లెజెండ్ ఏఎన్ఆర్ బయోపిక్ తెరకెక్కిస్తున్నారనే వార్తలు వచ్చినప్పుడు కూడా నాగార్జున ఈ విషయాన్ని ఖండించడం జరిగింది. ఏఎన్ఆర్ బయోపిక్ చేసే సాహసం ఎవరు చేయలేము అని కూడా ఆయన తెలిపారు.

ఒక నటుడు మాత్రమే కాదు..ప్రణాళిక బద్ధమైన జీవితానికి బ్రాండ్ అంబాసిడర్.. క్రమశిక్షణ.. కటోరమైన శ్రమ.. పోరాటం.. ధైర్యం అన్నీ ఆయన సొంతం. ఆయన సన్నిహితులు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు. ఇకపోతే అక్కినేని మల్టీస్టారర్ చిత్రం మనం రిలీస్ సమయంలో తనకు క్యాన్సర్ ఉందని ఎంతోకాలం బ్రతకనని.. ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే చావును కూడా ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించిన ఏకైక నటుడు ఏఎన్ఆర్ మాత్రమే.

అంతా తెలిసి కూడా ఆయన చూపించిన ధైర్యం అందరిని ఆశ్చర్యపరిచింది. ఆయన ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పారు. ఇకపోతే చివరి నిమిషంలో కూడా సినిమాల గురించి మాట్లాడిన ఏఎన్ఆర్ చివరి క్షణాలలో ఎవరిని తన దగ్గరకు రానిచ్చేవారు కాదట. అలా చివరికి లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *