Chiranjeevi

Chiranjeevi: యాంకర్ సుమ అంటే ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేని పేరు. ఈమె మొదట సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత యాంకరింగ్ రంగంలోకి అడుగు పెట్టింది.ఇక అలాంటి సుమా ప్రస్తుతం బుల్లితెర, వెండితెర మీద ఎలాంటి రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుమ జీన్స్, స్టార్ మహిళా, క్యాష్, భలే ఛాన్సులే వంటి ప్రోగ్రాం లకి యాంకరింగ్ గా చేసింది. వెండితెరపై జరిగే స్టార్ హీరోల సినిమాల ఆడియో ఫంక్షన్ లకి అయినా,ప్రీ రిలీజ్ ఈవెంట్ లైనా ఖచ్చితంగా సుమ ఉండాల్సిందే అంటారు.

ఇక అలాంటి సుమ (Suma)  ఈ మధ్యకాలంలో క్యాష్ షో కి పుల్ స్టాప్ పెట్టి సుమా అడ్డ పేరుతో సరికొత్త షోని ప్రారంభించింది.ఇక ఈ షోలో మొదటి గెస్ట్ గా చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు. అలాగే డైరెక్టర్ బాబి, కమెడియన్ వెన్నెల కిషోర్ లు కూడా వచ్చారు. అయితే ఈ షోలో పాల్గొన్న చిరంజీవిని యాంకర్ సుమ ఫూల్ చేసింది అంటూ ఒక వార్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక విషయంలోకి వెళ్తే.. చిరంజీవి సుమ అడ్డ షోలోకి వచ్చి చాలా సందడి చేశారు.

అంతే కాదు వన్ మ్యాన్ షో లాగా తన మాటలతో సుమను ఇరకాటంలో పెట్టారు. అయితే అదే టైంలో సుమా మీ ఎపిసోడ్ కు ఇంకో స్పెషల్ గెస్ట్ కూడా రాబోతున్నారు.ఆయన ఎవరో కాదు ది గ్రేట్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారు అని చెప్పారు. అయితే చిరంజీవి నిజంగానే రాఘవేంద్రరావు (Raghavendra Rao) గారు వస్తున్నారు కావచ్చు అని లేచి నిల్చని ఆయనకు వెల్కమ్ చెబుదామనుకున్నారు.కానీ సడన్గా జబర్దస్త్ కమెడియన్ గడ్డం నవీన్ ఎంట్రీ ఇచ్చాడు.

దీంతో చిరంజీవి (Chiranjeevi)  ఒక్కసారిగా షాక్ అయ్యి ఇదేంటి రాఘవేంద్రరావు అని చెప్పి ఈయన ను పిలిచారు నేను ఆయన వస్తున్నారు కావచ్చు అని లేచి ఆయనకి గౌరవప్రదంగా వెల్కమ్ చెబుదామని అనుకున్నాను. నన్ను ఇలా ఫూల్ చేసావ్ ఏంటి అని సరదాగా మాట్లాడుతూనే సీరియస్ అయ్యారు చిరంజీవి. ప్రస్తుతం ఈ విషయం తెలిసిన చాలామంది మెగా అభిమానులు ఏంటి సుమా మా చిరంజీవి (Chiranjeevi) నే ఫూల్ చేస్తావా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *