Pradeep

Pradeep: గడసరి అత్త సొగసరి కోడలు అనే ప్రోగ్రాం ద్వారా బుల్లితెరపై యాంకర్ గా పరిచయం అయ్యాడు ప్రదీప్. ఈ షో తో కాస్త పాపులారిటీ సంపాదించుకున్న ప్రదీప్ ఆ తర్వాత ఈటీవీ ప్లస్ లో ప్రసారమయ్యే ఎక్స్ప్రెస్ రాజా షో తో అమ్మాయిలకు ఫేవరెట్ యాంకర్ గా మారిపోయారు. ఇక ఆ తర్వాత వరుసగా కొన్ని ఈవెంట్లకు, ప్రోగ్రామ్లకు యాంకరింగ్ చేస్తూ బుల్లితెర మీద ఉన్న మేల్ యాంకర్స్ లో టాప్ యాంకర్ గా పేరు తెచ్చుకున్నారు.

అలాగే ఢీ షోలో కూడా ప్రదీప్ (Pradeep) హోస్ట్ గా చేస్తారు. ఇక ఇదిలా ఉంటే ఇంత వయసు వచ్చినా కూడా పెళ్లి గురించి క్లారిటీ ఇవ్వడం లేదు. పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా ప్రభాస్ (Prabhas) తర్వాత చేసుకుంటా సల్మాన్ ఖాన్ తర్వాత చేసుకుంటా అంటూ పెళ్లి వార్తలను దాటేస్తారు. ఇక గత కొన్ని రోజుల నుండి ఫ్యాషన్ డిజైనర్ నవ్య మారౌతుని పెళ్లి చేసుకుంటున్నారు అంటూ కొన్ని వార్తలు వినిపించాయి.

ఇక తాజాగా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనే షోలో ప్రదీప్ తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ షోలో సంగీత దర్శకుడు రఘు కుంచే (Raghu Kunche) గెస్ట్ గా వచ్చారు. రావడంతోనే ప్రదీప్ పెళ్లి గురించి అడుగుతూ కొన్ని రోజుల నుండి నీ పెళ్లి గురించి ఏవేవో వార్తలు వస్తున్నాయి నిజమేనా ఆ అమ్మాయి ఎవరో మాకు కూడా చెప్పొచ్చు కదా అని అడిగాడు.

దానికి ప్రదీప్ (Pradeep) మాట్లాడుతూ.. ఆ అమ్మాయి ఎవరో నాకు కూడా తెలియదు..చూస్తే నేను కూడా షాక్ అవుతాను.. అసలు ఇంటర్నెట్లో నా పెళ్లి వార్త చూసి నేనే షాక్ అయ్యాను అంటూ తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు ప్రదీప్. ఇక ఈయన మాట్లాడిన మాటలతో నైనా తన పెళ్లి వార్తలకు పుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి. అయితే ఇదిలా ఉంటే ప్రదీప్ సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఈ ఏడాది చివరిలోపు కచ్చితంగా పెళ్లి చేసుకుంటారని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *