Brahmanandam

Brahmanandam: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ బ్రహ్మా గా పేరు తెచ్చుకున్నారు కమెడియన్ బ్రహ్మానందం గారు.ఈయన కామెడీ వేర లెవెల్ అని చెప్పవచ్చు. నిన్న మొన్నటి వరకు ఈయన లేకుండా ఒక్క సినిమా కూడా వచ్చేది కాదు అంటే అతిశయోక్తి కాదు. కానీ ఈ మధ్యకాలంలో ఆయన ఆరోగ్యం అంత బాగా లేకపోవడం వల్ల కేవలం ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో మాత్రమే నటిస్తున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో కమెడియన్ బ్రహ్మానందం ఓకెత్తయితే మిగిలిన కమెడియన్స్ అందరు ఒకెత్తు అని అంటుంటారు సినీ జనాలు.

బ్రహ్మానందం (Brahmanandam)  పెట్టే ఎక్స్ప్రెషన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మీమ్స్ చేసే వారికి అన్నం పెడుతున్నాయని చెప్పవచ్చు.బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్స్ ని పెట్టి సోషల్ మీడియాలో ఎంతోమంది మీమ్స్ చేస్తూ ఉంటారు. ఇక ఈ విషయం పక్కన పెడితే ఇటీవల కాలంలో బ్రహ్మానందం గారు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొని ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ.. నేను అప్పట్లో ఉన్న సీనియర్ హీరోలందరితో కలిసి నటించాను. కానీ ఒక్క ఎన్టీఆర్ తో మాత్రం నటించలేదు. అలాగే అసలు ఎన్టీఆర్ తో నటించే అవకాశం వస్తుందో రాదో అనుకున్నాను.

కానీ ఎట్టకేలకు నాకు మేజర్ చంద్రకాంత్ (Major Chandrakanth) అనే సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ టైంలో మోహన్ బాబు (Mohan Babu) గారు నన్ను వద్దని చెప్పారు.బ్రహ్మానందం గారు చాలా బిజీగా ఉంటారు. ఆయన ఇలాంటి చిన్న పాత్ర కోసం డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టం అవుతుంది అని చెప్పారు. కానీ ఆ టైంలో డైరెక్టర్ రాఘవేంద్రరావు గారి లోపలికి ఎన్టీఆర్ గారే ప్రవేశించి నన్ను ఆ సినిమాలో తీసుకోవాలని భావించినట్లు నాకు అనిపించింది అంటూ బ్రహ్మానందం గారు ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో చెప్పుకొచ్చారు. ఇక మేజర్ చంద్రకాంత్ సినిమాలో నేను ఓ రిక్షావాడి పాత్రలో నటించాను.

అయితే మేజర్ చంద్రకాంత్ సినిమా చేసే టైంలో ఎన్టీఆర్ (Sr.NTR) గారు సీఎం.అయితే ఆయన ట్యాంక్ బండ్ పై విగ్రహాలు పెట్టినప్పుడు చాలామంది ఆయనను వృధా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.ఇక అదే విషయాన్ని ఈ సినిమాలో చెప్పాలనుకున్నారు. దాంతో ఆ విషయాన్ని అర్థమయ్యేలా అందరికీ చెప్పడానికి రిక్షా వాడి పాత్రకి ఆ డైలాగ్ ఇచ్చారు.అయితే అయితే వేరే ఎవరైనా ఆ డైలాగ్ చెప్తే అంతగా పట్టించుకునే వారు కాదు జనాలు. కానీ బ్రహ్మానందం (Brahmanandam)  చెప్పారు కాబట్టి ఆయన చెప్పిన విషయాన్ని అందరూ గ్రహిస్తారని రాఘవేంద్ర రావు గారు నన్ను ఆ పాత్రకి ఎంపిక చేశారు అంటూ బ్రహ్మానందం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో వెల్లడించారు.

   Click here for follow Pakkafilmy in google news

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *