Chiranjeevi

Chiranjeevi: వాల్తేరు వీరయ్య.. ఈ సినిమాతో చిరంజీవి మళ్లీ ఫామ్ లోకి వచ్చారు అన్న జోష్ లో మెగా అభిమానులు ఉన్నారు. అంతేకాకుండా ఇంద్ర సినిమా తర్వాత సరిగ్గా 20 ఏళ్లకి మళ్ళీ ఇంద్ర వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాని వాల్తేరు వీరయ్య తో అభిమానులకు అందించారని చాలా మంది భావిస్తున్నారు. ఇక అలాంటి తరుణంలోనే చిరంజీవిపై ఒక దారుణమైన రూమర్ ని కొంతమంది వైరల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ రూమర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తన స్వయంకృషితో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలను భరించి అంచలంచెలుగా ఎదిగి దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా కొనసాగుతున్నారు. ఇక చిరంజీవి (Chiranjeevi) కొన్ని రోజులు ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత మళ్లీ ఖైదీ నెంబర్ 150 అనే సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇక ఆ తర్వాత సైరా, ఆచార్య,గాడ్ ఫాదర్ వంటి సినిమాల్లో నటించారు.

ఇక ఈ మధ్యనే గాడ్ ఫాదర్ రీమేక్ సినిమాలో నటించినప్పటికీ ఫ్యాన్స్ ని అంతగా తృప్తి పరచలేకపోయారు. అయితే తాజాగా వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) సినిమాతో ఫ్యాన్స్ కి మంచి సినిమా అందించారు. ఇక ఈ నేపథ్యంలోనే చిరంజీవి మరో రీమేక్ సినిమా చేస్తున్నారు అంటూ ఒక అతిపెద్ద రూమర్ ని చిరంజీవిపై రుద్దుతున్నారు. తమిళ్ స్టార్ హీరో అజిత్ హీరోగా చేసిన విశ్వాసం సినిమాని రీమేక్ చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలు వైరల్ చేస్తున్నారు.

కానీ విశ్వాసం సినిమా ఇప్పటికే తెలుగులో కూడా వచ్చి టీవీలలో కూడా చాలా మంది చూశారు. కానీ అలాంటి సినిమాని చిరంజీవి రీమేక్ చేస్తారా అనేది అసలు ప్రశ్న. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ ఎన్నోసార్లు చూసినా విశ్వాసం (Vishwasam)  సినిమాని చిరంజీవి రీమేక్ చేయరు అని వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు చిరంజీవి వి.వి.వినాయక్ తో సినిమా చేస్తారు అనేది వాస్తవమే కానీ విశ్వాసం రీమేక్ ని కాదు అని చాలామంది ఆ రూమర్ ని కొట్టిపారేస్తున్నారు. కేవలం చిరంజీవి అంటే పడనివాళ్లే ఇలా చిరంజీవిపై అంత దారుణమైన రూమర్ ని క్రియేట్ చేస్తున్నారు అంటూ చిరంజీవి (Chiranjeevi) సన్నిహితులు కొంతమంది వెల్లడిస్తున్నారు.

   Click here for follow Pakkafilmy in google news

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *