Suma

Suma: తెలుగు ఇండస్ట్రీలో తన మాటలతో ఎంత పెద్ద స్టార్ హీరో హీరోయిన్లైనా సరే ఇరుకున పెట్టేసే యాంకర్ ఎవరైనా ఉన్నారా అంటే మన అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది సుమాకనకాల. యాంకర్ సుమ (Suma) గారు సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై ఆ తర్వాత యాంకరింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. ఇక ఈ యాంకర్ హోస్టుగా చేసిన స్టార్ మహిళ, జీన్స్,క్యాష్, భలే చాన్సులే వంటి ప్రోగ్రాములు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇక స్టార్ మహిళ వంటి ప్రోగ్రాం ని ఏకంగా కొన్ని వేల ఎపిసోడ్లను నడిపించిన యాంకర్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా కేవలం బుల్లితెర మీదే కాకుండా వెండితెరపై స్టార్ హీరోల ఆడియో ఫంక్షన్లకి,ప్రీ రిలీజ్ ఈవెంట్లకి,ఇంటర్వ్యూలకి ఖచ్చితంగా సుమ (Suma)  రావాల్సిందే అంటారు ప్రతి ఒక్కరు. ఇక ఇంతటి క్రేజ్ తెచ్చుకున్న సుమా కనకాల ఈ మధ్యకాలంలో క్యాష్ ప్రోగ్రామ్ కి పులిస్టాప్ పెట్టి సుమ అడ్డా (Suma Adda)  అనే పేరుతో కొత్త షో ని మొదలుపెట్టారు.

ఇక ఈ షోలో మొదటి గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అలాగే డైరెక్టర్ బాబి కమెడియన్ వెన్నెల కిషోర్లు హాజరయ్యారు. ఇక ఇదిలా ఉంటే సుమా ఈ షోలో కాస్త హద్దులు మీరి యాంకరింగ్ చేస్తుంది అంటూ కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి. అలాగే చిరంజీవితో ఈమె చేసిన అల్లరి బాగా వైరల్ అయింది. అంతేకాకుండా ఆ తర్వాత జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్లు వచ్చిన ఎపిసోడ్ లో కూడా ఈమె హద్దులు మీరి ప్రవర్తించినట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి.

అయితే ఈ విషయం తెలిసిన చాలామంది సుమా (Suma) కూడా డబ్బుల కోసం ఇలా హద్దులు మీరి యాంకరింగ్ చేస్తుందా అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాజీవ్ కనకాల (Rajeev Kanakala ) కూడా సుమ యాంకరింగ్ పట్ల కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయాన్ని చాలా వైరల్ చేస్తున్నారు నెటిజన్స్.

   Click here for follow Pakkafilmy in google news

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *