Chiranjeevi

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన నటనా టాలెంట్ తో మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్న చిరంజీవికి వాల్తేరు వీరయ్య సినిమాతో తన 20 ఏళ్ల కల మళ్లీ నెరవేరిందట. ఇంతకీ చిరంజీవికి నెరవేరిన ఆ కల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చిరంజీవి (Chiranjeevi) ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. అయితే 2002లో వచ్చిన ఇంద్ర సినిమా తర్వాత రీమేక్ కాకుండా స్రైయిట్ సినిమా ఒక్కటి కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టలేదు.

తాజాగా వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) సినిమాతో మళ్లీ చిరంజీవి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇంద్ర సినిమా తర్వాత ఎన్నో రీమేక్స్ సినిమాలు వచ్చాయి. కానీ అవి అంతగా వసూళ్లు తెచ్చి పెట్టలేదు. ఇంద్ర తర్వాత శంకర్ దాదా ఎంబిబిఎస్,ఠాగూర్,ఖైదీ నెంబర్ 150 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి కానీ ఇండస్ట్రీ హిట్ కొట్టలేకపోయాయి.అలాగే ఈ సినిమాలన్నీ రీమేక్ సినిమాలే. కానీ స్ట్రైయిట్ మూవీలు ఒక్కటి కూడా హిట్ అవ్వలేకపోయాయి. అందులో సైరా, స్టాలిన్,ఆచార్య వంటి సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.

అలాగే ఈ మధ్యకాలంలో వచ్చిన రీమేక్ మూవీ గాడ్ ఫాదర్ కూడా అంతగా వసూళ్లు తెచ్చి పెట్టలేదు. అందుకే ఇంద్ర సినిమా తర్వాత మళ్లీ 20 ఏళ్లకు వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి (Chiranjeevi) ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇక ఈ సినిమా ఇప్పటికే ఓవర్సీస్ లో 2 మిలియన్స్ క్లబ్ లోకి కూడా జాయిన్ అయింది. ఇక తెలుగులో ఇప్పటికే 100 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ దిశగా ముందుకు వెళుతుంది.

ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహించగా..మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించారు. ఇక ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి భోళా శంకర్ (Bhola Shankar) అనే సినిమాలో నటిస్తున్నారు..ఇందులో తమన్న హీరోయిన్ కాగా.. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలు పాత్రలో నటిస్తోంది.

    Click here for follow Pakkafilmy in google news

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *