Prabhas

Prabhas: ఒకే ఒక్క హీరో.. 2500 కోట్ల పెట్టుబడి. మీకు అందరికీ ఇప్పుడికే అర్థమై ఉంటుంది. ఆ హీరో ఎవరో .. అవును మీరు అనుకునే హీరోనే..ఆయనే ప్రభాస్. ప్రభాస్ మీద ఒకటి రెండు కాదు ఏకంగా రెండున్నర వేల కోట్ల బడ్జెట్ పెట్టారు నిర్మాతలు. మరి ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియన్ సినిమాల్లోనే మోస్ట్ బిజీయేస్ట్ హీరోగా మారిపోయారు ప్రభాస్. నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించిన ఇదే నిజం. ఎందుకంటే ప్రభాస్ (Prabhas) చేతిలో ఒకటి రెండు సినిమాలు కాదు ఏకంగా 8 సినిమాలు ఉన్నాయి.

ఈ సినిమాలన్నీ అఫీషియల్ గా అనౌన్స్ చేసినవే. స్వయంగా నిర్మాతలే ఈ సినిమాలన్నీ కన్ఫామ్ చేశారు. ఎనిమిది సినిమాల్లో ఏది ఫస్ట్ రిలీజ్ అవుతుందో ప్రభాస్ కి కూడా తెలియదు. ఈయన ప్రస్తుతం సలార్ (Salaar) ,ప్రాజెక్టుకే సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఓ వారం ప్రశాంత్ నీల్ సినిమాలకు డేట్స్ ఇస్తే, మరో వారం నాగ్ అశ్విన్ సినిమాలకు డేట్స్ ఇస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు డైరెక్టర్ మారుతి సినిమాని కూడా పట్టాలెక్కించారు ప్రభాస్. ఈ మూడు సినిమాల బడ్జెట్ దాదాపు 800 కోట్లు.

అందులో ప్రాజెక్ట్ కే (Project k) సింహభాగం తీసుకుంటుంది. ప్రాజెక్టు కే సినిమాకి 400 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నారు. ఈ సినిమా 2024 లో రిలీజ్ కానుంది. సలార్ సినిమా కోసం 300 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. ఇక మారుతి సినిమా కోసం150 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నారు. ఇవన్నీ సెట్స్ పై ఉన్న సినిమాలు. అయితే షూటింగ్ పూర్తి అయిన సినిమా ఆది పురుష్ (Aadi Purush) . ఈ సినిమా కోసం 300 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ నే పెట్టారు. ఆది పురుష్ జూన్ లో విడుదల కానుంది.

ఇక సందీప్ రెడ్డి డైరెక్షన్లో రాబోతున్న స్పిరిట్ (Spirit) సినిమా సైతం 300 కోట్లకు పైగా బడ్జెట్ తో రాబోతోంది. ఈ సినిమాలన్నీ లైన్లో ఉండగానే మైత్రి మూవీ మేకర్స్ ప్రభాస్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో మరో సినిమా ప్రకటించారు. తాజాగా దిల్ రాజు సైతం ప్రభాస్ *Prabhas) , ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రావణం అనే సినిమా కన్ఫామ్ చేశారు. ఇక ఈ సినిమాల బడ్జెట్ 600 కోట్ల పైనే ఉంటుంది. ఇలా ప్రభాస్ కమిట్ అయిన అన్ని సినిమాల బడ్జెట్ లెక్కేస్తే దాదాపు 2500 కోట్లకు పైగానే ఉంది.

   Click here for follow Pakkafilmy in google news

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *