Anchor Suma

Anchor Suma: యాంకర్ సుమ అంటే వెండితెర ప్రేక్షకులతో పాటు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఈమె తన గలగల మాటలతో మాటల తూటాలతో ప్రతి ఒక్కరిని మెస్మరైస్ చేస్తుంది. అంతేకాదు ఈమె యాంకరింగ్ ముందు ఎంత పెద్ద హీరో అయినా సరే తలవంచాల్సిందే అనే రీతిలో ఈమె ఎదుటివారిని తన మాటలతో ఇరకాటంలో పెడుతుంది.అలాంటి సుమ (Anchor Suma) ఇప్పటికే బుల్లితెరపై ఎన్నో ప్రోగ్రామ్స్ ద్వారా ఫేమస్ అయ్యింది.

ఇక ఈమె చేసిన స్టార్ మహిళ ప్రోగ్రాం ఎన్ని ఎపిసోడ్లు పూర్తి చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే జీన్స్ వంటి ప్రోగ్రాం ద్వారా కూడా అందరినీ ఎంటర్టైన్ చేసేది. కేవలం బుల్లితెర మీదే కాకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎలాంటి ఆడియో ఫంక్షన్ అయినా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా.. హీరో హీరోయిన్లను ఇంటర్వ్యూ చేయాలన్నా..ప్రతి ఒక్క విషయంలో కచ్చితంగా సుమా (Anchor Suma) రావాల్సిందే అంటారు స్టార్ నటీనటులు. ఇక సుమ ఫాలోయింగ్ ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉంటుంది.

ఈ మధ్యకాలంలో సుమ అడ్డా అనే ప్రోగ్రాం ద్వారా చాలామంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయబోతుందట సుమ.అలాగే సుమ అడ్డా (Suma Adda) కి సంబంధించిన ఒక ప్రోమో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే మరొక చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే సుమా చేసే క్యాష్ ప్రోగ్రామ్ తీసేశారు. దాని ప్లేస్ లో సుమా అడ్డ అనే ప్రోగ్రాం ని చేస్తున్నారు. అయితే క్యాష్ ప్రోగ్రామ్ ని నిలిపివేయడానికి ప్రధాన కారణం ఏంటంటే.. క్యాష్ ప్రోగ్రామ్ ఇప్పటికే చాలామందికి బోర్ అనిపిస్తుందట.

అంతేకాదు చాలామంది సెలెబ్రిటీలు రిపీట్ గా రావడం వల్ల ఈ షో చూసేవారికి బోర్ కొడుతుందని చాలామంది భావిస్తున్నారట.ఇక అలాంటి నేపథ్యంలోనే ఈ షో ప్లేస్ లో ఇంకో కొత్త షో పెట్టి జనాలను మరింత అట్రాక్ట్ చేయాలని మల్లెమాలవారు భావించారట. అందుకే క్యాష్ (Cash) షో ని తీసేసి సుమా అడ్డ పేరుతో సరికొత్త షోని ప్రసారం చేస్తున్నారు. అయితే క్యాష్ షో మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త వినిపిస్తోంది.

  Click here for follow Pakkafilmy in google news

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *