VeeraSimhaReddyVeeraSimhaReddy.. బాలకృష్ణ అఖండ సినిమా తర్వాత ఫుల్ జోషులో తెరకెక్కించిన చిత్రం వీరసింహారెడ్డి సినిమా జనవరి 12న అంటే ఈరోజు ఉదయం చాలా గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఎప్పటినుంచో ఉర్రూతలూగించే బాలయ్యను చూడడానికి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఇకపోతే మొదటి షో తోనే మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా.. జయపజయాల గురించి మాట్లాడాలి అంటే మరికొన్ని రోజులలో తెలిసిపోతుంది అని చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో కూడా విడుదలకాబోతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య పై తన అభిమానం ఎలాంటిదో చూపించే ప్రయత్నం చేశారు యూఎస్ఏ అభిమానులు. ముఖ్యంగా యూఎస్ఏ లో బాలయ్య అభిమానులు.. బాలయ్య మరియు సీనియర్ ఎన్టీఆర్ చిత్రాలతో ముద్రించిన టీ షర్ట్ లను ధరించి తమ ప్రేమను వ్యక్తం చేశారు. దీన్ని పట్టి చూస్తే నందమూరి ఫ్యామిలీ అంటే వీరికి ఏ రేంజ్ లో పిచ్చి ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు తమ కార్లకు అతికించిన, ముద్రించిన జెండాలు పోస్టర్లు పట్టుకొని మోటారు ర్యాలీగా ప్రదర్శనకు వెళ్తున్నారు.

యూఎస్ఏ ప్రాంతంలో బాలకృష్ణకు భారీ ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో అభిమానులు ఇలా జెండాలు ప్లకార్డ్ లు పట్టుకొని.. టీ షర్ట్లు ధరించి సినిమాను హోరెత్తించారు. ఇకపోతే ప్రీమియర్ షో మరికొన్ని గంటల్లో ప్రారంభమవుతాయి. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలకృష్ణ కు జోడిగా శృతిహాసన్ నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఇప్పటికే ట్విట్టర్ రివ్యూల ద్వారా అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రీమియర్ షో చూసి తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఏది ఏమైనా బాలయ్య అఖండ తర్వాత వీర సింహారెడ్డి (Veera Simha Reddy) సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారని చెప్పవచ్చు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *