Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) సినిమా విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. ఇక ఈ సినిమా విడుదల నేపథ్యంలో మూవీ యూనిట్ ఇప్పటికే ఎన్నో ప్రమోషన్స్ లో పాల్గొని తమ సినిమాని ప్రమోట్ చేశారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి బాలకృష్ణపై ఇండైరెక్టుగా సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ బాలకృష్ణపై వేసిన సెటైర్లు ఏంటంటే.. చిరంజీవి (Chiranjeevi) మాట్లాడుతూ.. నా కొడుకు చరణ్ ఎప్పుడూ కూడా తన సొంత కష్టంతోనే ముందుకు పోవాలి. అంతేకానీ ప్రతిసారి మా నాన్న గొప్పవాడు మా నాన్న ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగాడు.

మా నాన్న అలాంటోడు ఇలాంటి వాడు అని చెబితే వినే వాళ్లకు కూడా విసుగు వస్తుంది.వీడేంటి ఇలా ప్రతిసారి తండ్రి పేరు చెప్పుకొని మాట్లాడతాడు అని చాలామంది భావిస్తారు.కానీ చరణ్ (Charan)  అలా చెప్పాడు. అలా చెప్పకపోవడమే మంచిది. తన సొంత శక్తితో తాను హీరోగా ఎదగడమే నాకు కూడా కావాలి అంటూ చిరంజీవి (Chiranjeevi) ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక ప్రస్తుతం చిరంజీవి మాట్లాడిన మాటలు బాలకృష్ణపై ఇండైరెక్టుగా సెటైర్లు వేసినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే బాలకృష్ణ ఎక్కడ ఏ ఈవెంట్లో పాల్గొన్న అలాగే తన సినిమాకి సంబంధించిన ఏ ఈవెంట్లో అయినా కచ్చితంగా తన తండ్రి ప్రస్తావన తీసుకువచ్చి మా నాన్న అప్పట్లో అంటూ ఒక పదాన్ని కచ్చితంగా వాడతారు.

ఇక ఇదే విషయంపై చిరంజీవి ( Chiranjeevi)  తన కొడుకు గురించి ప్రస్తావించి పరోక్షంగా బాలకృష్ణ పై సెటైర్లు వేశారు అంటూ కొంతమంది నందమూరి అభిమానులు భావిస్తున్నారు. అంతేకాకుండా మా మధ్యన అలాంటి దూరం, ద్వేషం ఏమీ లేదని చెబుతూనే చిరంజీవి బాలకృష్ణ పై ఇలా ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేయడం ఏంటి అని నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బాలకృష్ణ (Balakrishna)  ప్రతిసారి తన తండ్రి పేరును ప్రస్తావిస్తూ మాట్లాడడం అనేది పూర్తిగా ఆయన ఇష్టం. ఆయన తండ్రి గొప్పవాడు కాబట్టే ప్రతిసారి తన తండ్రిని స్మరిస్తూ ఉంటాడు.

ఎవరి ఇష్టం వారిది నువ్వెందుకు వేలెత్తి చూపడం మా హీరోని అంటూ కొంతమంది నందమూరి అభిమానులు చిరంజీవిపై ఫైర్ అవుతున్నారు. అలాగే వీర సింహారెడ్డి (Veerasimhareddy) ఈవెంట్ కి శృతిహాసన్ (Sruthi Haasan) వచ్చి వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాకపోవడంతో చిరంజీవి స్టేజ్ మీద శృతిహాసన్ ని ఎవరైనా బెదిరించారు కావచ్చని అనడం పూర్తిగా బాలకృష్ణను ఉద్దేశించి అన్నట్లు అర్థమవుతుంది. ఎందుకంటే బాలకృష్ణ చెప్పడం వల్ల శృతిహాసన్ వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాలేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు.ఇలా సైలెంట్ గా ఉంటూ బాలకృష్ణ (Balakrishna) పై ఇండైరెక్టుగా కొన్ని సెటైర్లు వేస్తున్నారు చిరంజీవి.ఏది ఏమైనప్పటికీ మరికొన్ని గంటల్లో విడుదల అవ్వబోయే వాల్తేరు వీరయ్య (Waltair veerayya) సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో వేచి చూడాలి.

  Click here for follow Pakkafilmy in google news

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *