Prabhas Bad Quality

Prabhas Bad Quality: కృష్ణంరాజు వారసుడిగా ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఆ తర్వాత రాఘవేంద్ర సినిమాలో కూడా నటించారు.కానీ ఈయనకు స్టార్ స్టేటస్ తెచ్చింది మాత్రం చత్రపతి సినిమా అని చెప్పుకోవచ్చు.ఈ సినిమా రాజమౌళి డైరెక్షన్లో వచ్చి అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది.అంతేకాదు ఈ సినిమాని అప్పట్లోనే పాన్ ఇండియా లెవెల్ లో తీస్తే బాహుబలి కంటే ముందే ఇదే పాన్ ఇండియా లెవెల్ లో విడుదలయ్యేది అని చాలామంది భావిస్తున్నారు. ఇక చత్రపతి తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూ తన గ్రాఫ్ ని సినిమా సినిమాకి పెంచుకున్నారు.

ఇక బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. బాహుబలి సినిమా వల్ల ప్రభాస్ ప్రపంచం మొత్తానికి తానేంటో తెలియజేశాడు. ఈ సినిమాతో ఆయన మీద అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఆ తర్వాత వచ్చిన సాహో,రాధే శ్యామ్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.ఎందుకంటే బాహుబలి సినిమా తర్వాత అందరూ ప్రభాస్ (Prabhas) మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక అలాంటి ప్రభాస్ కథలు ఎంపికలో తప్పటడుగు వేశారని చాలామంది భావించారు. ప్రభాస్ రెండు సినిమాలు వరుసగా ప్లాప్ అయినప్పటికీ అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఆయన చేతిలో అయిదారు ప్రాజెక్టులు ఉన్నాయి.

ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రభాస్ చూడడానికి చాలా హ్యాండ్సమ్ గా కూల్ గా కనిపిస్తాడు. కానీ ఆయనలో ఒక బ్యాడ్ క్వాలిటీ (Prabhas Bad Quality) ఉందట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభాస్ ఏ విషయంలోనైనా చాలా కూల్ గా ఉంటారు. కానీ పెళ్లి విషయం వచ్చే వరకు మాత్రం తనని ఎవరైనా పదేపదే విసిగిస్తే వారిపై గట్టిగా అరుస్తారట. అంతే కాదు తనకు నచ్చన విషయంలో ఎవరైనా మొండి చేస్తే వారిని అస్సలు లెక్కచేయరట. ఆయన ముందు ఎంత పెద్ద వారున్నా సరే వారి మీద అరుస్తాడట. ఇక ఈ విషయాన్ని చాలామంది ప్రభాస్ తో పనిచేసిన డైరెక్టర్లు కూడా వారు పాల్గొన్న కొన్ని ఇంటర్వ్యూలలో తెలియజేశారు.

కానీ ఈ మధ్యకాలంలో ప్రభాస్ (Prabhas Bad Quality)  కాస్త తన కోపాన్ని కట్టిపెట్టాడట. మొదట్లో ప్రభాస్ కి చాలా కోపం ఉండేదట.చిన్న విషయానికే చాలా కోపం తెచ్చుకునే వారట. కానీ మునపటిలా తన కోపాన్ని తెచ్చుకోకుండా చాలా కూల్ గా వ్యవహరిస్తున్నారట. ఇక ప్రభాస్ కి బాగా కోపం వస్తే మాత్రం ఎదుటి వాళ్ళ పని ఖతం. ఇక దేవుడే దిగి వచ్చినా కూడా ఆయన కోపాన్ని ఆపడం అంత సులువు కాదట. ఇక ఈ విషయం తెలిసిన చాలామంది ప్రభాస్ హేటర్స్ మరీ ఇంత కోపం పనికిరాదు అంటూ తిట్టుకుంటున్నారు. ఇక ప్రభాస్ అభిమానులైతే కోపం వచ్చినప్పుడు కోపం చూపించాలి.. ప్రేమ కలిగినప్పుడు ప్రేమ చూపించాలి..అంటూ ప్రభాస్ ని వెనకేసుకు వస్తున్నారు.

Click here for follow Pakkafilmy in google news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *