NTRNTR.. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మూల స్తంభం అయిన ఎన్టీఆర్ (NTR) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో ఉండే చిన్న పెద్ద ఎవరినైనా సరే మర్యాదపూర్వకంగా మాట్లాడే అతి కొద్ది మంది నటులలో ఎన్టీఆర్ మొదటి స్థానంలో ఉంటారు. కేవలం తన తోటి నటీనటులకు మర్యాద ఇవ్వడమే కాకుండా వారిని క్రమశిక్షణలో పెట్టడంలో కూడా ఆయనకు ఆయనే సాటి. అంతేకాదు సినిమాల బడ్జెట్ విషయంలో రెమ్యునరేషన్ విషయంలో ఏ రోజు కూడా నిర్మాతలను ఇబ్బంది పెట్టలేదు. ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈయనసినీ పరిశ్రమలో అడుగుపెట్టిన తర్వాత చాలా మందితో చాలా రకాలైన అనుబంధాలను పెంచుకున్నారు.

ఆయనకు దగ్గరగా ఒక్కసారి బంధాన్ని పెను వేసుకుంటే మాత్రం చచ్చే వరకు అది కొనసాగేది. అందుకే అన్నగారికి అతి తక్కువ మందితో ఘాడమైన బంధాలు ఉండేవి. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు చిత్తూరు నాగయ్య. తొలి తరం హీరో అయిన నాగయ్యను ఎన్టీఆర్ తన గురువుగా భావించేవారు. అంతేకాదు ఆయనను నాన్న అంటూ సంబోధించేవారు కూడా. ఎన్టీఆర్ తో పాటు అక్కినేని నాగేశ్వరరావు సైతం నాగయ్యను సొంత తండ్రిలాగే భావించేవారు. గురు శిష్యుల అనుబంధం కంటే కూడా వీరి మధ్య గొప్ప అనుబంధం పెనవేసుకొని ఉండేది. గయ్యాళి అత్త పాత్రలో నటించిన సూర్యకాంతాన్ని ముద్దుగా అత్తా అని పిలిచేవారు. ఆమె చనిపోయే వరకు కూడా సూర్యకాంతంను ఎన్టీఆర్ అత్త అని సంబోధించేవారు.

సావిత్రి తో కూడా ఆయన సోదరి భావాన్ని కలిగి ఉండేవారు. ఆమె హీరోయిన్ గా ఎన్టీఆర్ తో సినిమాలలో నటించినా కూడా సావిత్రమ్మ అంటూ ఆమెను ఒక చెల్లెలు లాగా చూసుకునేవారు. ఇండస్ట్రీలో తన తల్లిని కాకుండా అమ్మగా పిలిచే వ్యక్తి కూడా ఇండస్ట్రీలో ఉన్నారు.. ఆమె ఎవరో కాదు పుండరీ భాయి..ఎన్టీఆర్ ఇండస్ట్రీకి రావడానికి ముందే ఆమె తొలి తరం హీరోయిన్ గా పనిచేశారు. ఎన్టీఆర్ కి తల్లిగా దాదాపు 30 సినిమాల వరకు ఆమె కనిపించింది.

చీర కట్టుకొని ఉండే ఆమెను చూస్తే ఎవరైనా సరే చేతులెత్తి నమస్కరించి అమ్మ అని పిలవాలనిపించే అంత నిండుతనంగా ఉండేది పుండరీదేవి. అందుకే సినిమాలలో నటిస్తున్నప్పుడు మాత్రమే కాకుండా షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఆమెను ఎన్టీఆర్ అమ్మ అని పిలిచేవారు. గజదొంగ, పాతాళ భైరవి వంటి సినిమాలలో వీరి అనుబంధం చాలా గొప్పగా చూపించారు.

Click here for follow Pakkafilmy in google news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *