Naresh-Pavithra Lokesh

Naresh-pavitra Lokeshనరేష్ పవిత్ర లోకేష్.. ఈ ఏడాది వీరి పేరు సోషల్ మీడియాలోనే కాకుండా డిజిటల్ మీడియాలో కూడా ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ మొదటి నుండి కలిసి తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు కానీ రోజురోజుకు వీరి మీద వార్తలు ఎక్కువగా రావడంతో ప్రతి ఒక్కరు వీరి పైన ఫోకస్ పెట్టారు. అంతేకాదు వీరిద్దరూ పెళ్లి కాకుండానే సహజీవనం చేస్తున్నట్టు ఎన్నోసార్లు నిర్ధారణ జరిగింది.అలాగే ఈ సీన్లోకి నరేష్ (Naresh) మూడో భార్య రమ్య రఘుపతి కూడా ఎంట్రీ ఇచ్చి నాకు విడాకులు ఇవ్వకుండా వేరే వ్యక్తితో ఎలా కలిసి ఉంటారు అంటూ నానా రచ్చ చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇక నరేష్ పై ఎన్ని వార్తలు వచ్చినా కూడా పవిత్ర లోకేష్ ని వదిలిపెట్టకుండా తన ఇంట్లో జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో పవిత్ర లోకేష్ ని కూడా తీసుకొని వచ్చి భార్యాభర్తలు లాగే ఉన్నారు. అలాగే ఇటీవల కృష్ణ (Krishna) గారు మరణించినప్పుడు కూడా పవిత్ర లోకేష్ నరేష్ భార్య భర్తల లాగే అన్నింటిలో పాల్గొన్నారు. అయితే ఈ విషయం పక్కన పెడితే.. పవిత్ర లోకేష్ నరేష్  (Naresh-pavitra Lokesh)  పై కావాలనే కొంతమంది వెబ్సైట్ వాళ్లు తప్పుడు వార్తలు రాస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చారు.

అంతే కాదు తెర వెనుక ఉండి వీరితో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి  (Ramya Raghupathi) కావాలనే ఇలా తప్పుడు రాతలు రాయిస్తోందని ఇప్పటికే ఎన్నోసార్లు బయటపెట్టారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కట్ చేసి మేమిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ఒక ఘాటు లిప్ లాక్ ఇచ్చుకున్న ఒక వీడియోని షేర్ చేశారు నరేష్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే నరేష్ పవిత్ర లోకేష్ (Pavithra Lokesh) ఇలా చేయడానికి ప్రధాన కారణం వీరిపై వస్తున్న వార్తలే అని తెలుస్తోంది. ఇప్పటికే వీరి మీద అక్రమ సంబంధం మెయింటైన్ చేస్తున్నారు అంటూ ఎన్నో వార్తలు వస్తున్నాయి.

ఇక వీటికి పుల్ స్టాప్ పెట్టి భార్యాభర్తల జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాము అని తెలియజేయడానికే నరేష్ పవిత్ర లోకేష్ (Naresh-pavitra Lokesh) ఈ వీడియో షేర్ చేసినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా వాళ్ళది అపవిత్ర బంధం కాదు పవిత్ర బంధం అని తెలియజేసేలా పెళ్లి పీటలు ఎక్కబోతున్నామని తెలియజేయడానికే ఈ వీడియో షేర్ చేసినట్లు సమాచారం.ఇక ఈ వీడియో వల్ల తమపై వస్తున్న తప్పుడు ప్రచారాలకు ఇప్పటికైనా పులిస్టాప్ పడతాయనే ఉద్దేశంతో ఈ వీడియోని షేర్ చేసినట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలిసిన చాలామంది నెటిజన్స్ వీళ్ళు లిప్ లాక్ వీడియో షేర్ చేయడం వెనుక అసలు రహస్యం ఇదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Click here for follow Pakkafilmy in google news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *