Vijay Deverakonda watch : `అర్జున్ రెడ్డి` సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ(Vijay deverakonda).. ఆ వెంటనే `గీతగోవిందం` సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుని టాలీవుడ్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. అయితే ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేశాడు. కానీ సరైన హిట్ మాత్రం పడలేదు. రీసెంట్గా విజ‌య్ దేవరకొండ `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు.

విజయ్ కెరీర్ లో తెరకెక్కిన తొలి పాన్‌ ఇండియా చిత్రమిది. బ్యాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందించిన ఈ సినిమా ఆగస్టు 25న తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళం హిందీ భాషల్లో అట్టహాసంగా విడుద‌లై అట్టర్ ప్లాప్ గా నిలిచింది. ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్న విజయ్ కు నిరాశే మిగిలింది.

అయితే వరుస ఫ్లాపుల్లోనూ విజయ్ క్రేజ్‌ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. ప్రస్తుతం ఈయన శివ నిర్వాణ దర్శకత్వంలో `ఖుషి`(Kushi) అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొంత షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ఇంత‌లోనే సమంత(Samantha) మయోసైటిస్ అనే అరుదైన‌ వ్యాధికి గురి కావడంతో షూటింగ్ కు బ్రేక్ ప‌డింది.

ఇదిలా ఉంటే ఫ్యాషన్ ఐకాన్ అయిన విజయ్ దేవరకొండ తాజాగా తన ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ లో కొన్ని స్టైలిష్ పిక్స్ ను షేర్‌ చేశాడు. ఈ పిక్స్ లో రౌడీ మ‌రింత హ్యాండ్స‌మ్‌గా క‌నిపిస్తే లేడీ ఫ్యాన్స్ ను చూపు తిప్పుకోకుండా చేశాడు. అయితే ఈ పిక్స్ లో విజయ్ ధరించిన వాచ్(Vijay deverakonda watch) ధర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది ఓ కార్టియర్ వాచ్ అట. దీంతో ఖ‌రీదు వింగే గుండె ఆగిపోతుంది. ఎందుకంటే, దాని ధ‌ర ముప్పై ల‌క్ష‌ల‌కు పైమాటే. అవును, విజ‌య్ ధ‌రించిన‌ సాంటోష్ డి కార్టియర్ వాచ్ అక్ష‌రాల‌ రూ. 30,42,935 ల‌క్ష‌లట‌. ఈ వాచ్ ధర తెలిశాక షాక్ అవ్వ‌డం నెటిజ‌న్ల వంతు అవుతోంది.

Click here to follow Pakkafilmy in google news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed