Tejaswini Pandit Wiki, Biography, Dob, Age, Height, Weight, Husband and MoreCasting couch సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు ఏ స్థాయిలో క్యాస్టింగ్ కౌచ్ బారిన పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాన్ని ఇటీవల బహిరంగంగానే ప్రకటిస్తూ అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నారు. ఇదే సమయంలో కొందరు నటీమణులు కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పి.. వీరు కూడా క్యాస్టింగ్ కౌచ్ బాదితులేనా అని అనిపించుకుంటున్నారు. ఇకపోతే ఇదే సమయంలో మరికొంతమంది నటీమణులు ఈ క్యాస్టింగ్ కౌచ్ (Casting couch)అనేది కేవలం సినిమా ఇండస్ట్రీకి పరిమితం కాదు ఇతర రంగాల్లో కూడా ఉంటుందని తెలిపారు.

ఈ క్రమంలోని ఇప్పుడు తాజాగా మరాఠీ నటి తేజస్విని పండిట్ కూడా తన జీవితంలో ఎదురైన ఒక చేదు అనుభవాన్ని మీడియాతో పంచుకొని ఎమోషనల్ అయ్యింది. హీరోయిన్లకు సినిమా వాళ్ల నుంచి కాకుండా బయట వ్యక్తుల నుంచి కూడా చేదు అనుభవాలు ఎదురవుతాయని తేజస్వి ని వెల్లడించింది. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన జీవితంలో జరిగిన చేదు అనుభవాన్ని పంచుకుంది. 2009 సంవత్సరంలో పూణేలో ఒక అపార్ట్మెంట్లో తేజస్విని (Tejaswini pandit)అద్దెకు ఉన్న సమయంలో ఈ సంఘటన జరిగిందట.

ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. “అప్పట్లో నా సినిమాలు ఒకటి రెండు మాత్రమే విడుదలయ్యాయి. ఆ సమయంలో ఆ అపార్ట్మెంట్ ఒక కార్పొరేటర్ కు చెందినది. ఒకసారి నేను అద్దె చెల్లించడానికి కార్యాలయానికి వెళ్తే ఆ సమయంలో ఆయన ఫేవర్ చేయమని నేరుగా అడిగాడు. అద్దెకు బదులు ఇంకేదో కావాలని అడిగాడు. ఆ అపార్ట్మెంట్ యజమాని అలా అడగగానే వెంటనే అక్కడ టేబుల్ పై నీటితో ఉన్న గ్లాసుని తీసుకుని అతని ముఖంపై విసిరినట్లు తెలిపింది తేజస్విని. అలాంటి పనులు చేయడానికి ఈ వృత్తి లోకి రాలేదని.. అలా చేసి ఉంటే ఇలాంటి అద్దే అపార్ట్మెంట్లో ఉండే అవసరం రాదని యజమానికి చెడ పడా ఇచ్చినట్లు ” గుర్తు చేసుకుంది.

ప్రస్తుతం ఈమె తన జీవితంలో ఎదుర్కొన్న చేదు ఘటనలను మీడియాతో పంచుకుంటూ ఎమోషనల్ అయింది .ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది తేజస్విని.

Click here to follow Pakkafilmy in google news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *