top gun hero tom cruise jump from filghtTom Cruise:  మిషన్ ఇంపాజిబుల్ సినిమా లతో ప్రపంచంలోని ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు హీరో టామ్ క్రూయిస్(Tom Cruise) మొదటి నుంచి ఈ హీరో వ్యవహరించే తీరు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. తన సినిమా మొదలుపెట్టే దగ్గరినుంచి రిలీజ్ అయ్యే వరకు ఎన్నో విన్యాసాలతో సినిమా ను పబ్లిసిటీ చేస్తూ అలరిస్తూ ఉంటారు.

అలా ఇటీవలే అయన నటించిన టాప్ గన్ (Top Gun) సినిమా సూపర్ హిట్ కావడంతో అయన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పాడు. ఎన్నో సార్లు ఈ సినిమా ను ఆదరించిన అందరికి థాంక్స్ చెప్పిన టామ్ తాజాగా మరో సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుని అభిమానులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు.

ప్రస్తుతం మిషన్ ఇంపాజిబుల్ కొత్త సినిమా పనులలో ఉన్న టామ్ విమానం నుంచి దూకి ఒక్కసారిగా అందరిని హడలెత్తించేశాడు. ఈ వీడియో ను ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేశాడు. మిషన్ ఇంపాజిబుల్ లో సీన్స్ ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందులోని సీన్స్ ఎంతో ఒళ్ళు గగుర్పుడుతాయి. షూటింగ్ సన్నివేశాలు కూడా అదే స్థాయి లో ఉంటాయి.

అలా ఓ సీన్ లో పాల్గొంటున్న టామ్ ఈ విన్యాసాన్ని తన అభిమానులకోసం చేసి వారిని ఆనంద పరిచాడు. ట్విట్టర్ లో ఈ వీడియో పోస్ట్ చేయగా అభిమానులు లైక్ ల మీద లైక్ లు కొడుతున్నారు. దక్షిణాఫ్రికా లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న పేర్కొన్నాడు. ఏదేమైనా ఇలాంటి విన్యాసాలు చేయాలంటే ఎంతో ధైర్య సాహసాలు ఉండాలి. అభిమానులు అయితే టామ్ ఇందులో ఆరితేరాడు అని కామెంట్స్ పెడుతున్నాడు. మరి ప్రపంచ రికార్డులను తన గుప్పిట్లో పెట్టుకున్న టాప్ ఈ సినిమా తో ఇంకెలాంటి రికార్డులను తిరగరాస్తాడో చూడాలి.

Click here to follow Pakkafilmy in google news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *