Celebritie hiers: సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉన్న బడా ఫ్యామిలీ నుంచి వరుసగా హీరోలు ఇండస్ట్రీలోకి వస్తున్నారు. కానీ వారి వారసులుగా ఉన్న అమ్మాయిలు మాత్రం హీరోయిన్లుగా రావడం లేదు. అయితే కొంతమంది అభిమానుల కోరిక మేరకు.. హీరోయిన్ గా రావాలనుకున్న తమ కోరికను చంపుకుంటే.. మరికొంతమంది ఇండస్ట్రీలోకి రావడం ఇష్టం లేక హీరోయిన్ పాత్రలకు దూరం అవుతున్నారు. మరి కొంతమంది బడా ఫ్యామిలీల నుంచి వచ్చి హీరోయిన్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మరి వారెవరో ఇప్పుడు ఒకసారి చూసి తెలుసుకుందాం.

    Click here for follow Pakkafilmy in Google news

నిహారిక:
బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు నిహారిక. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ ఈమె కావడం గమనార్హం. మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. మెగా కుటుంబానికి ఏకైక సినీ వారసురాలు. హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో నటించి సరైన గుర్తింపు లభించక వివాహం చేసుకొని ఇప్పుడు వెబ్ సీరీస్ లకు నిర్మాతగా మారింది.

కళ్యాణి ప్రియదర్శన్:
హలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈమె.. ఈమె తల్లి లిజి మలయాళం స్టార్ హీరోయిన్ మరియు తండ్రి ప్రియదర్శన్.. ప్రియదర్శన్ మలయాళం, హిందీ చిత్రాలలో ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

శృతిహాసన్ , అక్షరాహాసన్:
ప్రముఖ విశ్వనటి కమలహాసన్ కుమార్తెలు శృతిహాసన్, తెలుగులో అనగనగా ఓ దీరుడు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా చలామణి అవుతుంటే ఆయన రెండవ కూతురు అక్షర హాసన్ అజిత్ వివేకం చిత్రంతో తమిళ్, తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

కార్తీక – తులసి:
అలనాటి కథానాయక రాధా కుమార్తెలు కార్తీక, తులసి. 2009లో నాగచైతన్య సరసన జోష్ సినిమా ద్వారా కార్తీక అరంగేట్రం చేస్తే.. రెండవ కుమార్తె తులసి కూడా కడలి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

మంచు లక్ష్మి:
ఇండస్ట్రీలో మంచి పేరు మోసిన ఫ్యామిలీ మంచు కుటుంబం నుంచి వచ్చిన హీరోయిన్ మంచి లక్ష్మి అనగనగా ఓ ధీరుడు సినిమా ద్వారా తన సినీ కెరియర్ ను మొదలు పెట్టింది.

https://news.google.com/s/CBIw_NDY40Y?sceid=IN:te&sceid=IN:te&r=11&oc=1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *