కృతి సనన్(Kriti Sanon).. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ సినీ కెరీర్‌ ప్రారంభమైన‌ది తెలుగు చిత్రంతోనే. మహేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన `1 నేనొక్కడినే` మూవీతో ఈ అమ్మడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ఆ తర్వాత కృతి సనన్‌ తెలుగులో కనిపించలేదు. బాలీవుడ్ కు మ‌కాం మార్చి అక్కడే తనదైన టాలెంట్ తో వరుస ఆఫర్లను అందుకుంటూ సత్తా చాటుతోంది. తెలుగు ప్రేక్షకులు కృతి సనన్ ను మర‌చిపోతున్న తరుణంలో మళ్లీ ఈ భామ `ఆదిపురుష్`(Adipurush) సినిమాకు సైన్ చేసింది.

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రత్(Om Raut) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపొదిద్దుకుంటున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. ఇందులో సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, హేమమాలిని తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల సమ్మర్ కు రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు.

    Click here for follow Pakkafilmy in Google news

అయితే ఈ సినిమా కంటే ముందే కృతి సనన్‌ రీసెంట్గా `తోడేలు` మూవీతో ప్రేక్షకులను పలకరించింది. వరుణ్ ధావన్ ఇందులో హీరోగా నటించాడు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సంగతి పక్కన పెడితే.. కృతి సనన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం పంచుకుంది. తన మొదటి హీరో మహేష్ బాబు(maheah babu)ను మిస్టర్ కూల్ అంటూ తెగ పొగిడేసింది. అలాగే ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌ చేసింది.

ప్రభాస్‌ మంచి కో స్టార్ అని, సెట్లో అందరితోనూ స్నేహంగా ఉంటార‌ని, పైగా తనకు తెలుగు నేర్పింది కూడా ప్రభాసే అని ఆమె పేర్కొంది. `ఆదిపురుష్‌ సినిమా మొదలైన కొత్తలో ప్ర‌భాస్ కు హిందీ అంతగా వచ్చేది కాదు. నాకు తెలుగు రాదు. ప్ర‌భాస్‌(prabhas) నాకు తెలుగు నేర్చించారు. బదులుగా నేను నాకొచ్చిన హిందీ ఆయనకు నేర్పాను. సెట్స్ లో ఖాళీ దొరికిందంటే ఇద్ద‌రం ఆ ప‌నే చేసేవాళ్లం. ఇప్పుడు నా తెలుగు కాస్త మెరుగుపడింది. దానికి కారణం ప్రభాస్‌. ఈ విషయంలో ఆయనకు థాంక్స్‌ చెప్పుకోవాలి. అలాగే ప్ర‌భాస్ కూడా హిందీ చ‌క్క‌గా మాట్లాడుతున్నారు` అంటూ కృతి స‌న‌న్ చెప్పుకొచ్చింది. ఇక ప్ర‌భాస్ కు, త‌న‌కు మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.. కానీ, అది నిజం కాద‌ని కృతి పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *