రాశి ఖన్నా(Raashii Khanna).. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఓ హిందీ చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ అందాల సోయగం.. `మనం` మూవీ తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర‌కు పెద్దగా గుర్తింపు ఉండదు. కానీ ఆ తర్వాత వచ్చిన `ఊహలు గుసగుసలాడే` సినిమాతో రాశి ఖ‌న్నా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

ఈ క్రమంలోనే ఆమెకు ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్గా గుర్తింపు పొందిన రాశి ఖ‌న్నా.. తమిళంలోనూ సినిమాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది. అయితే గ‌త‌ కొంతకాలం నుంచి ఈ అమ్మడు సరైనా హిట్‌ లేక తీవ్రంగా సతమతమవుతుంది. ఈమె నుంచి చివరిగా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్(world famous lover), అంతఃపురం, పక్కా కమర్షియల్, థ్యాంక్యూ చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.

ఇక ధ‌నుష్‌ హీరోగా వ‌చ్చిన `తిరు` సినిమా మంచి విజయం సాధించింది. కానీ అందులో రాశి ఖ‌న్నా పాత్రకు అధిక ప్రాధాన్యత లేకపోవడం వల్ల తిరు మంచి విజయం సాధించిన ఆమెకు ఒరిగిందేమీ లేకుండా పోయింది. ఇక కెరీర్‌ డేంజర్ జోన్ లో పడుతుంది అనుకుంటున్న తరుణంలో `సర్దార్(Sardar)` రూపంలో హిట్టు కట్టి రాశి ఖ‌న్నా మ‌ళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కింది. కోలీవుడ్ స్టార్ కార్తి, రాశి జంటగా నటించిన ఈ చిత్రం ఇటీవల తెలుగు తమిళ భాషల్లో విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం సక్సెస్ జ్యోష్ లో ఉన్న రాశి ఖ‌న్నా మరిన్ని ఆఫర్లను అందుకునేందుకు తెగ ప్రయత్నిస్తోంది.

ఈ సంగతి పక్కన పెడితే.. రాశి ఖ‌న్నా బర్త్ డే(Raashii Khanna Birthday) నేడు. ఈ సందర్భంగా రాశి తన ఇంట్లో మొక్కలు నాటుతున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. అలాగే ఈ సందర్భంగా రాశి ఖ‌న్నా.. తనకు అత్యంత సంతోషాన్ని ఇచ్చే పని మొక్కలు నాటడం అని పేర్కొంది. అంతేకాదు తన ప్రతి పుట్టినరోజుకు ఇలానే మొక్కలు నాటడం తనకున్న అలవాటు అని చెప్పుకొచ్చింది. దీంతో రాశి ఖ‌న్నా పై పలువురు నెటిజ‌న్లు మరియు అభిమానులు శభాష్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, రాశి నేడు తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుందని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *