మహేష్‌బాబుకి పాపం చాలా పెద్ద కష్టమే వచ్చింది. గత కొన్ని నెలలుగా మహేష్‌బాబు ఇంట్లో వరుస విషాదాలు అయితే చోటు చేసుకున్నాయి. అన్నయ్యను కోల్పోయాడు మహేష్

ఇటీవల తల్లిని కూడా ఆయన కోల్పోయాడు. ఇప్పుడు తండ్రి కృష్ణ ఆరోగ్య పరిస్థితి కూడా అత్యంత విషమంగా వుంది. ఈ పరిస్థితుల్లో మహేష్‌బాబుకి మనమంతా అండగా వుందాం..’ అంటూ మహేష్ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా నినదిస్తున్నారు.

నిజానికి, ఇలాంటి అభిమానుల్ని కలిగి వుండడం మహేష్‌బాబు అదృష్టమనే చెప్పాలి.సూపర్ స్టార్ కృష్ణ నుంచి మహేష్‌బాబు వరకూ.. ఘట్టమనేని అభిమానులు, తమ అభిమాన నటుల్ని కేవలం అభిమానించడమే కాదు, అంతకు మించిన ఆప్యాయతని కూడా పంచిపెడుతున్నారు.

కుల మతాలకతీతంగా సూపర్ స్టార్ కృష్ణకి లక్షలాది మంది అభిమానులున్నారు. ఆ అభిమానులంతా, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలియగానే, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు ప్రారంభించారట… తెలుగు రాష్ట్రాల్లో పెద్దయెత్తున ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారట ఘట్టమనేని అభిమానులు.

‘మహేష్ అన్నా.. మీకు మేమున్నాం.. సూపర్ స్టార్ కృష్ణగారు ఫైటర్.. ఆయన ఆరోగ్యంగా ఇంటికి వస్తారు.. మీరు దిగులు చెందకండి..’ అంటూ అభిమానులు తమ అభిమాన హీరోని ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *