టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె నటన చూసిన ప్రతి ఒక్కరూ తెలుగు ఇండస్ట్రీకి మంచి హీరోయిన్ దొరికిందని అనుకుంటున్నారు. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు శ్రీలీలా.. ఇక ఈరోజు మనం శ్రీ లీలా యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం.. శ్రీ లీలా జూలై 14, 2001లో జన్మించింది. మొదట కన్నడ భాషలో అడుగుపెట్టి తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదుగుతోంది. ఇక 21 యేళ్ళ వయసులోనే మాస్ మహారాజ రవితేజ సరసన నటించే అవకాశాన్ని పొందింది. అమెరికాలో పుట్టింది బెంగళూరులో పెరిగింది చదువు అంతా కూడా బెంగళూరులోనే పూర్తి చేసింది.

శ్రీ లీలా కి చిన్నతనంలోనే క్లాసికల్ డాన్స్ అంటే చాలా ఇష్టం.. మరి ఈమె చదువు విషయానికి వస్తే.. ఎంబిబిఎస్ ఫైనలియర్ చదువుతోంది శ్రీ లీలా.. చిన్నతనం నుంచి డాక్టర్ అవ్వాలని కోరిక ఉండేదట. ఇక ఆమె తల్లి కూడా బెంగళూరులో డాక్టర్ గా పనిచేస్తుంది. ఇక స్వర్ణలతకు శ్రీ లీలా జన్మించే సమయానికి ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభకరరావుతో విడాకులు జరిగిపోయాయి. ఇక తన తల్లి సింగిల్ గా శ్రీ లీలాను పెంచి పెద్ద చేసింది.

ఇక చదువు పూర్తి చేసుకున్న సమయంలోనే కన్నడ ఇండస్ట్రీ నుంచి అవకాశాలు రావటం మొదలయ్యాయి. దాంతో మొదటగా 2019లో కిస్ అనే సినిమాలో నటించింది. ఆ తరువాత భరతే అనే మరో సినిమాలో నటించింది. ఆ తరువాత తెలుగు ఇండస్ట్రీలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందD సినిమాతో కెరియర్ మలుపు తిప్పుకుంది అనే చెప్పాలి. ప్రస్తుతం రవితేజతో ధమాకా అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలోని పాటలు , ట్రైలర్ లు బాగా హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం శ్రీ లీలా తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో సినిమాలను చేస్తూ బిజీగా ఉంది. శ్రీ లీలా తీసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ బాగానే సంపాదించింది.

ఇక శ్రీ లీల ఆస్తుల వివరాలకు వస్తే.. ఆమె దగ్గర ఆల్టో ఎక్స్ ప్రెస్ కారు ఉంది. దీని ధర రూ.5 లక్షలు.. అలాగే రూ.17 లక్షలు విలువ చేసే హోండా సిటీ కారు కూడా ఆమె గ్యారేజ్ లో ఉంది. అప్పట్లో శ్రీ లీలా నటించిన కిస్ సినిమా కోసం పారతోషకం రూ.21 లక్షలు తీసుకుంది. ఆ తరువాత పెళ్లి సందD సినిమాకి రూ.30 లక్షలు.. ఆ తరువాత రవితేజ తో నటిస్తున్న ధమాకా సినిమాకి రూ. 80 లక్షలు పారతోషకం అందుకుంది శ్రీ లీలా.. రాబోయే రోజుల్లో మరింత పెంచే అవకాశం ఉంది. ఇక ఆమె నివసిస్తున్న ఇల్లు , కార్లు లగ్జరీ వస్తువుల విషయానికి వస్తే దాదాపు రూ. 7కోట్ల నుంచి రూ.8 కోట్ల విలువ ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *