బిగ్ బాస్ సీజన్ 6 చూసే ప్రేక్షకుల్లో రోజురోజుకు ఆసక్తి పెరుగుతుంది. బిగ్ బాస్ ఇచ్చే విచిత్రమైన టాస్కులతో హౌస్ లోని కంటెస్టెంట్ లలో ఎంతో మంది కొట్లాటలు, గొడవలు పెట్టుకుంటూ షో చూసేవారిలో మరింత ఆసక్తి పెంచుతున్నారు. ఇక ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని హౌస్ లోని కంటెస్టెంట్లకు అలాగే బిగ్ బాస్ ప్రేక్షకులందరికీ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు.

విషయంలోకి వెళ్తే.. బిగ్ బాస్ సీజన్ 6 స్టార్ట్ అయినప్పుడు అందరూ ఈ షో చూడడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే తెలియని మొహాలను షోలోకి తీసుకువచ్చారని షో చూడడానికి ఎవరు ఆసక్తికనపరచలేదు. కానీ రోజు రోజుకు షో రసవత్తరంగా మారడంతో చాలామంది ప్రేక్షకులు మళ్లీ బిగ్ బాస్ షో ని ఆదరిస్తున్నారు. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందంటూ అందరికీ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో శనివారం రోజు బాలాదిత్య ను ఎలిమినేట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఇక బాలాదిత్య హౌస్ లోకి గుడ్ బాయ్ గా ఎంటర్ అయ్యి అలాగే గుడ్ బాయ్ గా హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఇక బాలాదిత్య తర్వాత మెరీనా ఎలిమినేట్ అవుతుందని వార్తలు వినిపించాయి.కానీ ఎవరు ఊహించని విధంగా గ్లామర్ క్వీన్ వాసంతి కృష్ణన్ హౌస్ నుండి ఎలిమినేట్ అవుతుందంటూ ఓ వార్త బిగ్ బాస్ హౌస్ నుండి లీక్ అయింది. దీంతో వాసంతి అభిమానులు అందరూ ఆందోళనలో పడిపోయారు.

అయితే ఈ వారం బాలాదిత్య, మెరీనా ఇద్దరు ఎలిమినేట్ అవుతారని ప్రచారం జరిగాక చివరి నిమిషంలో మెరీనా ప్లేస్ లో వాసంతిని ఎలిమినేట్ చేశారని తెలుస్తోంది. అయితే తాజాగా ఎలిమినేషన్ వెనుక భారీ కుట్ర జరిగింది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఇక వాసంతి విషయంలో కేవలం స్వార్థం కోసమే బిగ్ బాస్ టీం ఇలాంటి పని చేసిందంటూ నెట్టింట్లో వార్తలు వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *