టీడీపీ నాయకుడు పరిటాల రవి హత్య కుట్రలో భాగంగా కారు బాంబు పేల్చి హతమార్చాలని ప్రయత్నించినప్పుడు జరిగిన సంఘటనలను తాజాగా సీనియర్ జర్నలిస్టు భరద్వాజ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని వెల్లడించారు. అప్పటికే టీవీ బాంబు కేసులో జైల్లో ఉన్న మద్దెల చెరువు సూరి శిక్ష అనుభవిస్తున్నప్పటికీ.. జైలులో ఉంటూనే బయట తన శత్రువు పరిటాల రవి హత్యకు కుట్ర చేశారు. అయితే ఆ కుట్రలో భాగంగా బాంబు పేలుడులో దాదాపు 24 మంది మరణించారు .. నిందితులు 8 మందికి జీవిత ఖైదు విధించారు.

మోహన్ బాబు రేర్ ఫోటో: పరిటాల రవి, నెహ్రూలతో.., 'వాళ్లెప్పుడూ నా హృదయంలో' |  hero mohan babu rare photo with paritala ravi and devineni nehru - Telugu  Oneindiaఇకపోతే పరిటాల రవి తండ్రి పరిటాల శ్రీరాములు జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కించిన మూవీ శ్రీరాములయ్య . అయితే ఈ సినిమా విడుదల వేడుక రామానాయుడు స్టూడియోలో నానక్రామ గూడా లో జరిగింది. వేడుక అయిపోయాక తిరిగి వెళుతున్న సమయంలో ల్యాండ్ మైన్ పేల్చి పరిటాల రవిని హతమార్చాలని చూశారు. జైలు నుండి తన అనుచరులతో కుట్రకు ప్లాన్ చేసి అప్పుడే ఇంజనీరింగ్ పూర్తయిన ఒక విద్యార్థి ద్వారా ల్యాండ్ మైన్ తయారుచేయించి కారు వచ్చే చోట పెట్టారు.

ఆ కారులో పరిటాల రవి , మోహన్ బాబు, పరిటాల రవి బావ కృష్ణారావు ముగ్గురు కూడా కార్ లోనే ఉండగా. ఆ కారు కంటే ముందు మీడియా వాళ్ళు వెళ్తున్న వాహనం వాళ్లను ఓవర్ టేక్ చేసి ల్యాండ్ మైన్ మీద వెళ్లడం వల్ల ఆ కారు పేలి అందులో ఉన్న 24 మంది మరణించారు. అలా 1997లోనే మోహన్ బాబు ఆ కారు ప్రమాదంలో మరణించాల్సి ఉన్నా.. మీడియా వాళ్ల వాహనం ఓవర్టేక్ చేయడం వల్ల బ్రతికిపోయారు అంటూ.. అప్పుడు జరిగిన సంఘటన ఇటీవల గుర్తుచేసి అందరికీ తెలియజేశారు భరద్వాజ.

అయితే మోహన్ బాబు ఆరోజు చనిపోయి ఉంటే ఈ రోజు ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తు అంతం అయి ఉండేది. తన విద్యా సంస్థల ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ.. వారిని సమాజంలో ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్న ఘనత మోహన్ బాబుకే చెల్లుతుంది.ఏది ఏమైనా ఆయన చేయాల్సిన కార్యక్రమాలు చాలానే ఉన్నాయి. ఆయనను అంత త్వరగా ఎవరు తీసుకెళ్లలేరు అంటూ అభిమానులు కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *