టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్ర లో నటించిన సరికొత్త చిత్రం యశోద. ఆరోగ్య కారణాల దృష్ట్యా కొన్ని రోజులుగా ట్రీట్మెంట్ కె భాగమైన ఈ హీరోయిన్ ఇటీవలే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కాగా ఈ సినిమా తొలి రోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. వెరైటీ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా ను శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకద్వయం హరి, హరీష్ దర్శకత్వం వహించారు. విడుదలైన రోజు హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా డీసెంట్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అయితే సోషల్ మీడియా లో ఓ ప్రచారం జరుగుతుంది.

అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన థాంక్యూ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ కంటే ఈ సినిమా కలెక్షన్స్ ఎక్కువగా వచ్చాయని ఫ్యాన్ వార్ జరుగుతుంది. హైదరాబాద్‌లో థ్యాంక్యూ సినిమా 63 లక్షలు, బింబిసార 58 లక్షలు, ది ఘోస్ట్ 49 లక్షలు సాధించగా..యశోదా సినిమా 65 లక్షలు వసూలు చేసింది. దాంతో సమంత కు ఉన్న క్రేజ్ ఏంటో రుజువైంది.

ఇక దేశవ్యాప్తంగా వివిధ భాషల కలెక్షన్ల విషయానికి వస్తే. యశోద సినిమా తెలుగులో 3 కోట్లు, హిందీలో 10 లక్షలు, తమిళంలో 10 లక్షలు, మలయాళంలో 10 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 3.25 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో 80 లక్షలు కలుపుకొంటే.. ఈ చిత్రం మొత్తంగా 4 కోట్ల వసూళ్లను రాబట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *