అల్లు శిరీష్.. ఈయన చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ అందులో మెజారిటీ సినిమాలు కమర్షియల్ గా విజయం సాధించాయి. ఇక ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో మొదటిసారి మంచి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు అల్లు శిరీష్. ఇక తాజాగా అల్లు శిరీష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు.

అల్లు శిరీష్ మాట్లాడుతూ.. మా ఫ్యామిలీ బయట హీరోలతో కూడా సినిమాలు తెరకెక్కిస్తుంది. హీరోలకు కాదు మా గీత ఆర్ట్స్ కథకు ప్రాధాన్యత ఇస్తుంది. నేను గతంలో ఏది ఆలోచించకుండా ఏది పడితే అది మాట్లాడేవాడిని. ఒకవేళ సినిమా నచ్చకపోతే మొహం మీదే బాగాలేదని ముక్కు సూటిగా చెప్పేవాడిని. ఎందుకంటే అప్పట్లో ఉడుకు రక్తం, కుర్రతనం కాబట్టి అలాంటి మాటలు నా నోటి నుండి ఎక్కువగా వచ్చేవి.

నేను గజిని సినిమా హిందీ వర్షన్ కు పని చేశాను. నాకు చిన్నప్పటి నుండే అమీర్ ఖాన్ అంటే చాలా ఇష్టం. నేను కమర్షియల్ హీరో రేంజ్ కి చేరుకోవాలంటే కాస్త సమయం పడుతుంది. ఇంకా ఆ రేంజ్ కి నేను చేరుకోలేదు. నాకు చిరంజీవి గారు నటించిన సినిమాలలో ఎక్కువగా జగదేకవీరుడు అతిలోకసుందరి బాగా ఇష్టం. అలాగే మా అన్న అల్లు అర్జున్ కి మా నాన్న 21 సంవత్సరాలు వచ్చినప్పుడు కార్ ని బహుమతిగా ఇచ్చారు.

అలాగే నాక్కూడా కార్ గిఫ్ట్ గా ఇవ్వమని మా నాన్నని అడిగితే నన్ను చెప్పుతో కొడతానని అన్నారు అంటూ అల్లు శిరీష్ ఆ ఇంటర్వ్యూలో ఆయన గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మరోవైపు అల్లు శిరీష్ కి సంబంధించిన కొత్త సినిమాల గురించి క్లారిటీ రావాల్సి ఉంది. అల్లు శిరీష్ ఎక్కువ సినిమాల్లో నటించడం కంటే మంచి సినిమా కథ ఉన్న సినిమాలో నటించడానికే ఇష్టపడతాడట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *