ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది సమంత. మొదటి సినిమాతోనే అందర్నీ అట్రాక్ట్ చేసి ఆ తర్వాత స్టార్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా అక్కినేని నాగార్జున కొడుకు నాగచైతన్య తో ప్రేమాయానం నడిపి పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇక వీరిద్దరి మధ్య నాలుగు సంవత్సరాలు చాలా అన్యోన్యత ఉండేది. కానీ ఏమైందో ఏమో కానీ గత సంవత్సరం ఎవరు ఊహించని విధంగా మేమిద్దరం విడాకులు తీసుకుంటున్నామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

ఇక ఈ విషయంలో సమంతని అక్కినేని అభిమానులతో పాటు చాలామంది ట్రోల్స్ చేశారు. దాంతో సమంత చాలా డిప్రెషన్ లోకి వెళ్లి మానసికంగా చాలా కృంగిపోయింది. ఇక ఈ విషయం పక్కన పెడితే తాజాగా సమంత తాను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ గానే ప్రకటించింది. అంతేకాదు తాను హాస్పిటల్ లో బెడ్ మీద పడుకొని ఉండే ఫోటోలు కూడా షేర్ చేసింది. ఇక ఈమె ఫోటోలు చూసి చాలామంది ఆమె అభిమానులతో పాటు అక్కినేని అభిమానులు కూడా అయ్యో పాపం అంటూ కామెంట్స్ చేశారు.

సెలబ్రిటీలు, అభిమానులు అందరూ సమంత త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా సమంత హెల్త్ పై ఒకప్పటి స్టార్ డైరెక్టర్ గీత కృష్ణ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. గీత కృష్ణ మాట్లాడుతూ.. సమంత నాకు మోడలింగ్ చేసే టైం నుంచి తెలుసు. ఆమెకు మొదట కడలి సినిమాలో ఛాన్స్ వచ్చింది.కానీ ఆమెకు చర్మసంబదిత సమస్యలు ఉన్నాయని సముద్రంలో దిగడానికి ఒప్పుకోక ఆ కారణంతో సమంత సినిమాని రిజెక్ట్ చేసింది. అయితే ఒకవేళ సమంతకు నిజంగానే ఆ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి ఉంటే యశోద ప్రమోషన్స్ లో పాల్గొనేది కాదు కదా. ఆమె కేవలం సింపతి కోసమే ఇలాంటి పనులు చేస్తోంది అంటూ సెన్సేషనల్ కామెంట్ చేశాడు.

అంతేకాకుండా ఒకవేళ సమంత కు వ్యాధి ఉన్నా కూడా అది అంత సీరియస్ కాదు కావచ్చు. అందుకే ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటూనే ప్రమోషన్స్ లో పాల్గొంది. ఆమెను చూసుకోవడానికి అందరూ ఉన్నారు. అందరూ ఉన్నా కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియోలు పెట్టడం ఏంటో నాకు అర్థం అవడం లేదు.అసలు అలాంటి వీడియోలు పెట్టాల్సిన అవసరం లేదు. అంతే కాదు సమంత పై నెగిటివిటీ పెరగడానికి కారణం ఆమె విడాకులు తీసుకోవడం, అలాగే ఐటెం సాంగ్స్, గ్లామర్ ఫోటోషూట్లు చేయడమే. అలాంటి నెగటివ్ కామెంట్స్ రావడం వల్ల పబ్లిక్ గా తన వ్యాధి గురించి చెప్పుకొని ఆమె మీద సింపతీ పెంచుకోవడానికి అలా చేసింది అంటూ గీత కృష్ణ సమంత వ్యాధిపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం గీతాకృష్ణ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *