నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి సినిమాను విడుదల చేసే ప్రయత్నాల్లో చిత్ర బృందం ఉంది. ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తు ఉండగా శృతిహాసన్ కథానాయకగా నటిస్తున్న ఈ సినిమా కు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం తర్వాత నందమూరి బాలకృష్ణ చేయబోయే సినిమా గురించి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఎదురు చూశారు.

అలా అనిల్ రావిపూడి దర్శకత్వంలోనే త్వరలోనే చేయబోతున్న నందమూరి బాలకృష్ణ ఆ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని భావిస్తున్నాడు. అందుకే ఈ సినిమా కోసం ఒక బాలీవుడ్ బ్యూటీని హీరోయిన్ గా ఎంపిక చేయాలని ఆయన చెబుతున్నారట. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా కోసం సోనాక్షి సిన్హాను ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసే విధంగా రంగం సిద్ధం చేస్తున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *