ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమా తో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిరంజీవి ఇప్పుడు తదుపరి సినిమా పనులను వేగంగా చేస్తున్నాడు. బాబీ దర్శకత్వంలోని సినిమా ను సంక్రాంతి కి విడుదల చేయడానికి సిద్ధమైన చిరు ఆ విధంగా పనులు చేస్తున్నాడు. కాగా ఇన్నిరోజులు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా డబ్బింగ్ పనులు నేడు ప్రారంభం అయ్యాయి. దర్శకుడు బాబీ, పలువురు టెక్నీషియన్ల సమక్షంలో లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, డబ్బింగ్ కార్యక్రమాలు షురూ చేశారు.

ఇక ఈ సినిమా యొక్క టైటిల్ ను త్వరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. త్వరలోనే ఈ చిత్రం నుంచి భారీ అప్ డేట్లు వస్తాయని తెలిపింది. బహుశా అది టైటిల్ కన్ఫర్మేషన్ అయ్యుంటుందని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ దీపావళి నాడు వెలువడుతుందని టాక్ వినిపిస్తోంది. ఇకపోతే మెగా స్టార్ ఈ సినిమా ను మాత్రమే కాకుండా భోళా శంకర్ సినిమా ను కూడా విడుదల కు సిద్ధం చేశాడు. వేసవి లో ఈ సినిమా ను విడుదల చేయనున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *