బుల్లితెర మీద ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక ఈ షో ద్వారా ఇప్పటికే సుడిగాలి సుదీర్,హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ వంటి వాళ్లు ఇంత ఫేమస్ అయ్యారో, వాళ్లలాగే పంచ్ ప్రసాద్ కూడా బాగా ఫేమస్ అయ్యారు. ఈయన జబర్దస్త్,శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో చాలా రోజుల నుంచి చేస్తూ అందర్నీ అలరిస్తున్నారు. తన పంచ్ లతో పంచ్ ప్రసాద్ గా పేరు తెచ్చుకున్నారు. ఇక ఇలా తెరమీద నవ్వులు పూయించే పంచ్ ప్రసాద్ జీవితంలో ఒక విషాదం ఉంది. అదేంటంటే పంచ ప్రసాద్ కి కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఇక ఈ విషయాన్ని ఆయన ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు.

తన అనారోగ్య సమస్యలు చెప్పి ఇతరులను బాధ పెట్టడమే కాకుండా వాటి ద్వారా ఎంతో మందిని నవ్వించారు. కానీ తాజాగా పంచ ప్రసాద్ కి ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. విషయంలోకి వెళ్తే.. పంచ్ ప్రసాద్ వేదిక మీద కనిపించారంటే ఇక నవ్వులు పూయిస్తూనే ఉంటాడు. ఎలాంటి ఈవెంట్ అయినా సరే పంచ్ ప్రసాద్ తన పంచ్ లతో అందరిని అలరిస్తాడు. ఇక ఈయన పంచులకు సుడిగాలి సుదీర్,హైపర్ ఆది, గెటప్ శ్రీను లు కూడా సైలెంట్ అవుతారు. ఇక ఇలాంటి మంచి కమెడియన్ కి గత కొన్నేళ్ల నుంచి కిడ్నీ సమస్య ఉంది అనే విషయం మనకు తెలిసిందే.ఇక ఆయనకు ఎన్ని అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఒక్కసారి వేదిక మీదికి వచ్చాడు అంటే అవన్నీ మర్చిపోయి ప్రేక్షకుల్ని నవ్వించడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు.

పంచ్ ప్రసాద్ ప్రతివారం డయాలసిస్ చేసుకుంటూనే తననొప్పి బయటి వారికి ఎవరికీ తెలియకుండా ప్రతి ఒక్కరిని నవ్విస్తూ ఉంటాడు. ఇక ఇలా నలుగురిని నవ్వించే పంచ్ ప్రసాద్ ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నారట. తాజాగా పంచ్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రకారం.. నూకరాజు, ఆసియా ఇద్దరు గత వారం నుండి పంచ్ ప్రసాద్ ఇంట్లోనే ఉంటున్నారట. అంతేకాదు ప్రసాద్ నడవలేని స్థితిలో ఉన్నాడని ఆయనకు సాయం చేస్తున్నామని చెప్పారు. అయితే పంచ్ ప్రసాద్ ఇలా ఎందుకు అయిపోయాడో ఆయన భార్య మాట్లాడుతూ.. మా ఆయన ఓ రోజు షూటింగ్ కంప్లీట్ అయ్యాక జ్వరంగా ఉందని ఇంటికి వచ్చి పడుకున్నారు.

ఆ తర్వాత నడుము నొప్పి తీవ్రంగా వస్తుందని బాధపడ్డారు. ఇక కొద్దిసేపట్లోనే నడవలేక చాలా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పడంతో హాస్పిటల్ కి తీసుకెళ్ళాను. కానీ ఈయనను చూసిన డాక్టర్లు మొదట్లో ఏం జరిగిందో తెలియక అన్ని టెస్టులు చేశారు. ఇక టెస్టుల్లో ఒక సంచలమైన నిజం బయటపడింది. మా ఆయన నడుము వెనక కుడి కాలు వైపు చీము పట్టిందట. దానివల్ల ఈయన నడవలేని స్థితిలో ఉన్నాడని డాక్టర్లు చెప్పారు అంటూ పంచ్ ప్రసాద్ భార్య చెప్పుకొచ్చింది. అయితే పంచ్ ప్రసాద్ ఉన్న దీనస్థితి గురించి బయట చెప్పడం ఎవరికీ ఇష్టం లేకపోయినా కూడా కమెడియన్ నూకరాజు వీడియో మొత్తం షూట్ చేసి యూట్యూబ్ ఛానల్ లో పెట్టారట. ఇక ఈ విషయంలో అభిమానులు పంచ్ ప్రసాద్ ని ఎవరైనా ఆదుకోండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *